అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 138:
సిరిదా దొలగును దుర్యశ
మరుదెంచునుగాన తెలియుమాయధికారీ !
 
27 సహకార భావముండుట
సహనంబును గలిగియుంట శాంతంబున నీ
యహమును వీడి మెలంగుట
లహరహమును నుండవలె సుమా యధికారీ!
 
28 నమ్ముటయుగాదు దెలియక
నమ్మకముండుతయుగాదు నయ మారయుచున్
నెమ్మది బరిశీలించుచు
నిమ్మహివర్తింపవలె జుమీ యధికారీ!
29 మాటయె సంధికి రంధికి
మాటయె ప్రేమంబు గూర్చి మరులుగొలుపగా
మాటయె వరములొసంగగ
మాటయె నరులకును మూట మహినధికారీ!
 
30 తొందరపాటును కూడదు
మందత్వము నుండరాదు మహి శీఘ్రగతిన్
పొందుగ కార్యము చందము
సందర్భము నెరిగిసేయ జను నధికారీ!
 
31 అలుకయు నర్ఢాపేక్శయు
కలనరమాతురత మరియు కామేచ్చయు దా
గలిగిన మనుజునకిలలో
గలుగదు శాంతియు సుఖంబు గనుమధికారీ!
 
32 ఆర్తుల గాపడుటయును
వర్తనము మంచిగలిగి వసుధార్కముగా
గీర్తిని సంపాదించుట
కర్తవ్యము నీకు తెలియగా నధికారీ!
 
33 జననియు జన్మస్ఠలమును
ఘనముసుమీ మనుజునకు జగంబున స్వర్గం
బునుమించి గాన భారత
జననీ సంసేవసేయ జనునధికారీ
 
34 రాజరికంబున బ్రభువులు
యేజీతము నీకు నిర్ణయించిరో దానిన్
నీజీవితంబు నడపుచు
పోజెల్లు దురాశ జెందబోకధికారీ!
 
35 ఆజీతంబును దొరుకక
నీ జగమున నెంతమంది నిస్ప్రుహను జనం
బీ జీవితంబు రోయుచు
రోజుచు తపియించెనో యెరుగుమధికారీ!
 
36 ప్రాప్తించు దానివలననె
ద్రుప్తింబడీ నీవు నీ యధీన జనాళిన్
ఆప్తుందవగుచు బ్రోవుము
బ్రాప్తించును దాన సౌఖ్యపద మధికారీ!
 
37 శీలము కీర్తికి మూలము
శీలమె పరలోకసౌఖ్యసిద్ధికిమూలం
బాలంబమెల్లసుక్రుతికి
వాలాయము శీలముడుగవ దధికారీ!
 
38 నీతియె గుణగణరాజము
నీతియె బుధలోకమాననీయ గుణంబున్
నీతియె కీర్తికరంబిల
పూతమతీ! నీతి విడువబోకధికారీ!
 
 
 
 
 
 
 
 
 
 
</poem>
 
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు