వీర్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==లో-స్పెర్మ్ లక్షణాలు==
శుక్రకణాల లోపాన్ని తెలిపే మొట్టమొదటి లక్షణం సంతానం కలిగించే శక్తి కొరవడటమే. దీనికి తోడు శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం, అంగస్తంభనలు ఎక్కువ సేపు ఉండకపోవడం, పురుషాంగంలో, వృషణాల్లో నొప్పి, వాపు రావడం, ముఖంలో గానీ, మిగతా శరీర భాగాల్లోని వెంట్రుకలు రాలిపోవడం, ఇతరమైన [[హార్మోన్ సమస్యలు]] తలెత్తడం ఇవన్నీ శుక్రకణాల సంఖ్య తగ్గడాన్ని తెలిపే లక్షణాలు. వీటన్నిటికీ హార్మోన్ వ్యవస్థలో వచ్చే తేడాలే మూలం. టెస్టోస్టెరాన్ హార్మోన్లు తగ్గిపోయినప్పుడు కండరాల వ్యవస్థలో క్షీణగతి ఏర్పడుతుంది. ఎముకలు గుల్లబారిపోతాయి. అసహనం, చికాకు , దేనిమీదా లగ్నం కాలేని ఒక అమనస్కత ఇలాంటి మానసిక ప్రకోపాలు ఏర్పడతాయి. చర్మం నిర్జీవంగా మారుతుంది. రక్తహీనత ఏర్పడుతుంది. జీవక్రియలు కుంటుపడతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్లు తగ్గడం వల్ల ఏర్పడిన శరీరంలోని అసహజ స్థితి వల్ల ఆ వ్యక్తి కేన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
 
==వాజీకరణ==
"https://te.wikipedia.org/wiki/వీర్యం" నుండి వెలికితీశారు