సోమనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశ మరియొక మంత్రి అయిన'''కె ఎమ్ మున్షి''' ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.
=== స్థలపురాణం ===
పురాణ కధనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని. ఆ తరువాత [[రావణుడు]] వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితోనూ పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై చంద్రుడికి అందరిని సమానంగా చూసుకొమ్మని సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు. inka
==== కాల నిర్ణయం ====
ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము సాధారాణ యుగము(చరిత్ర ఆరంభానికి ముందుకాలము). రెండవసారి యాదవరాజైన వల్లభాయి ముందునిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీ పూ 649లో పునర్నిర్మించాడని అంచనా. తరువాత క్రీ శ 725లో సింధూ నగర'''అరబ్''' గవర్నర్(రాజప్రతినిధి) జనయాద్ ఈ ఆలయాన్ని ధ్వంశం చేయడానికి సైన్యాలను పంపాడు. 815లో గుర్జర ప్రతిహరా రాజైన '''రెండవ నాగబటా''' ఈ ఆలయాన్ని మూడవమారు ఎర్ర ఇసుక రాళ్ళతో బృహత్తర నిర్మాణ్ణాన్ని నిర్మించాడని ఉహించబడుతుంది. క్రీ. శ 1024 '''గజనీ మహమ్మద్''' ధార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంశం చేసాడు. ఆలయం తిరిగి '''గుర్జర్ పరమ'''కు చెందిన '''మాల్వా''' రాజైన '''భోజి''' మరియు అన్‌హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ల చేత క్రీ. శ1026 మరియు 1042ల మధ్యీ ఆలయ పునర్నర్మాణం జరిగింది. కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమరపాల్ చేత క్రీ శ 1143-1172 ల మధ్య పునర్నిర్మించబడింది. క్రీ శ 1296 ఈ ఆలయం మరొకమారు సుల్తాన్ '''అల్లాద్దీన్ ఖిల్జీ''' సైన్యాల చేత తిరిగి కూల్చబడింది. క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన చుదాసమా వంశీయుడైన''' మహీపాదావ ''' చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. క్రీ శ 1326-1351 మధ్య ఈ ఆలయములో లింగప్రతిష్ఠ జరిగింది. క్రీ శ1375లో ఈ ఆలయం మరొకమారు గుజరాత్ సుల్తాన్ అయిన ''' మొదటి ముజాఫర్ షాహ్ ''' చేత కూల్చబడింది. క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్ అయిన '''ముహమ్మద్ ''' చేత తిరిగి కూలచబడింది. క్రీ శ 1701లో ఈ ఆలయం మరొక మారు కూల్చబడింది. క్రీ శ 1701లో '''ఔరంగజేబు''' చేత ఈ ఆలయాన్ని మరొకమారు ధ్వంశంచేయబడింది. ఈ ఆలయాన్ని ధ్వంశం చేసిన రాళ్ళను ఉపయోగించి '''ఔరంగజేబు''' మసీదును నిర్మించాడు. తరువాత క్రీ.శ 1783లో పూనా '''పేష్వా''', నాగపూరుకు చెందిన ''''భోన్స్‌లే'' , ఖోలాపూరుకు చెందిన '''చత్రపతి''' భోన్‌స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి '''అహల్యాభాయి''' గ్వాలియరుకు చెందిన '''శ్రీమంత్ పతిభువా ''' సమిష్ఠి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది.
"https://te.wikipedia.org/wiki/సోమనాథ్" నుండి వెలికితీశారు