విషకన్య (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

227 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
== రచయిత గురించి ==
''ప్రధాన వ్యాసం:[[ఎస్.కె. పొట్టెక్కాట్]]<br />
ఈ పుస్తకం మూలరచయిత ఎస్.కె.పొట్టెక్కాట్ మలయాళ సాహిత్యరంగంలో ప్రఖ్యాత రచయిత, జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన ప్రతిభాశాలి. పొట్టెక్కాట్ కథలు, నవలలే కాక కవిత్వం, యాత్రాకథనం వంటివి కూడా రచించారు. ఆయన ఒక్క ఆస్ట్రేలియా తప్ప మిగిలిన ప్రపంచ దేశాలన్నిటా పర్యటించి, తన అనుభవాలను యాత్రా రచనలుగా మలిచారు. నాడమ్, ప్రేమమ్, ప్రేమ శిక్ష, కరాంపు మొదలైనవి పొట్టెక్కాట్ చిన్న నవలలు. ఆయన రచించిన పెద్ద నవలల వరుసలో కేరళలో ఆస్తిపాస్తులు వదిలేసి బొంబాయి వెళ్ళిన కడు నిరుపేద, నిస్సహాయ కుటుంబాల బాధాతప్త గాథలను ఇతివృత్తంగా తీసుకుని ''మూడూ పడమ్'', తాను చాలాకాలంగా నివాసముంటున్న వీధిలోని మనుషుల నిజస్వరూపాన్ని ఇతివృత్తంగా ''ఒరు తెరువింటె కథ ''(ఒక వీధి కథ), తిరువాన్కూరు క్రైస్తవులు వయనాడు(మలబారు) ప్రాంతంలోని కొండలు, అడవుల మధ్యకు వెళ్లి అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి స్వావలంబనకు చేసిన ప్రయత్నం కథాంశంగా [[విషకన్య (పుస్తకం)|విషకన్య]] తదితర నవలలను రాశారు.<ref>విషకన్య:మూ.ఎస్.కె.పొట్టెక్కాట్, అ.పి.వి.నరసారెడ్డి:ఒ.ఎస్.వి.కురుప్పు వ్రాసిన పీఠిక</ref>
 
== ఇతివృత్తం ==
39,226

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019728" నుండి వెలికితీశారు