ఆపటెద్దు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆవులను దాటుటకు, వెంకటేశ్వరుని పేర అచ్చువేసి వదలివేయు మేలుజా...
 
చి వర్గం:పశుపోషణ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
ఆవులను దాటుటకు, వెంకటేశ్వరుని పేర అచ్చువేసి వదలివేయు మేలుజాతికోడె (Stud Bull) ఈ అచ్చువేయుట- వృషోత్సర్జనము, ఒక పెద్దతంతు. అపర క్రియలలోను, పెండ్లిండ్లలోను ఆయా పందిళ్ల యందె, వేంకటేశ్వరస్వామి పేర ఒక ఆణెపు (జాతిగల) ఆవుకోడెను పూజించి, దాని జొబ్బమీద గుండ్రముగా వాతవేసి (అచ్చువేసి) మంత్ర సహితముగా వదలివేయుదురు. అప్పుడు దానికి దేవబ్రాహ్మణ మాన్యములను తాకవలదని హితోపదేశము గావింతురు. గ్రామములలో దీనికి మంచిబెట్టు, గౌరవము. దీనిని కొట్టరు, దొడ్డికిగూడ తోలరు. యథేచ్ఛగా అన్ని పొలములలో తిరుగాడుచు, ఆవులు దాటుచు కాలము గడుపుచుండును. ఇది చనిపోయిన తర్వాత గూడ, బండి మీద బెట్టి, పెద్ద ఉత్సవముతో తీసికొనిపోయి సమాధి చేయుదురు. దీనిని అచ్చువేసిన ఎద్దు అందురు. దక్షిణదేశమున దీనిని పెరుమాళ్ల మాడు అని గౌరవింతురు. ఆబోతెద్దు. గూళి; సిమ్మాదిరప్పన్న; జన్నెకు విడిచిన పశువు; ఎత్తుకట్టిన పశువు. [నెల్లూరు]
[మాండలిక పదకోశము (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ) ]
 
[[వర్గం:పశుపోషణ]]
"https://te.wikipedia.org/wiki/ఆపటెద్దు" నుండి వెలికితీశారు