గోదావరి కథలు: కూర్పుల మధ్య తేడాలు

స్
పంక్తి 1:
గోదావరి కథలు పుస్తకాన్ని బి.వి.ఎస్.రామారావు వ్రాశారు. ఈ పుస్తకం గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల చుట్టూ అల్లుకున్న కథల సంకలనం.
== రచన నేపథ్యం ==
1980 ప్రాంతాల్లో వివిధ తెలుగు వార, మాస పత్రికల్లో బి.వి.ఎస్.రామారావు వ్రాసిన పలు కథలను ఈ సంకలనంగా ప్రచురించారు. పోలవరం, భద్రాచలం నుంచి గోదావరి పాయలు సముద్రంలో కలిసేవరకూ ఉన్న వివిధ ప్రాంతాలలో నదితో జీవితాన్ని పెనవేసుకున్న వారి జీవితాలను ఈ కథల్లో చిత్రీకరించారు. అన్ని కథలకూ గోదావరి నది నేపథ్యంగా అమరడం, రచయితకు గోదావరి పట్ల అభిమానం ఉండడం వంటి కారణాలతో సంకలనానికి గోదావరి కథలు అని పేరుపెట్టారు. సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు [[బాపు]] ఈ కథలకు బొమ్మలు వేశారు.
"https://te.wikipedia.org/wiki/గోదావరి_కథలు" నుండి వెలికితీశారు