జగపతి బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు సినిమాల్లోకి రావటం తమాషాగా జరిగింది. చదువుకునే సమయంలో రోజుకు 3 - 4 సినిమాలు చూసిన జగపతిబాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేదికాదు. ఎందుకంటే 12 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్నిరోజులు వైజాగ్ లో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని, నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు.
 
కో-డైరెక్టర్ ద్వారా విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి 1989 లో [[సింహస్వప్నం (1991 సినిమా)|సింహస్వప్నం]] సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేసారు. తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతిబాబు. ఇది చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరవాత చేసిన చాలాచిత్రాలు ప్లాపులుగానే నిలిచాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు [[జగన్నాటకం (1991 సినిమా)|జగన్నాటకం]], [[పెద్దరికం]] వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. పెద్దరికం సినిమాతో [[రాంగోపాల్ వర్మ]] దృష్టిలో పడ్డ జగపతి [[గాయం (సినిమా)|గాయం]] హిట్ తో హీరోగా స్థిరపడ్డాడు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం దాసోహం అయ్యారు.
 
 
"https://te.wikipedia.org/wiki/జగపతి_బాబు" నుండి వెలికితీశారు