పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

467 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
పన్నాలాల్ పటేల్ పూర్తిపేరు పన్నాలాల్ నానాలాల్ పటేల్. ఆయన గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన మండ్లి గ్రామం(దుంగార్ పూర్, రాజస్థాన్)లో మే 7, 1912 జన్మించారు. [[:en:edar|ఇడార్]](గుజరాత్)లో 6వ తరగతి వరకూ చదువుకున్నారు. పాఠశాలలోనే ప్రముఖ గుజరాతీ కవి ఉమాశంకర్ జోషి, పన్నాలాల్ పటేల్ కు సహాధ్యాయిగా ఉండేవారు. ఆయన పలు వృత్తులు చేపట్టినప్పటికీ అనతికాలంలోనే మద్యం ఫాక్టరీల్లో మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.
== రచన రంగం ==
పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషలో ప్రఖ్యాత కథకునిగా, నవలారచయితగా పేరుపొందారు. నవలా రచనలోనే కాక, కథానిక-నాటక రచనలలో కూడా సమానకీర్తిని ఆర్జించారు. ఆయన రచనలలో ''మళేలా జీవ్'', ''మానవీనీ భవాయీ'' మొదలైన నవలలు, ''సుఖ్ దుఃఖ్ నా సాధీ'', ''దిల్ నీ వాత్'' తదితర కథాసంపుటాలు, ''జమాయీ రాజ్''(ఏకాంకిక) మొదలైనవి ప్రధానమైనవి. పన్నాలాల్ పటేల్ రచనల్లో మానవుని కాంక్షకు, సమాజంలోని కట్టుబాట్లకు, విధి సృష్టించిన ఘటనలకు మధ్య జరిగే సంఘర్షణ ప్రధానమైనది అని దర్శక్ మొదలైన గుజరాతీ విమర్శకులు పేర్కొన్నారు.
 
== మూలాలు ==
39,742

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1023010" నుండి వెలికితీశారు