కొమ్మూరి వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
 
 
 
 
'''కొమ్మూరి వేణుగోపాలరావు''' (1935 - 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచయిత [[శరత్ చంద్ర]] ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్" గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా [[నవల]] లు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో ''హౌస్ సర్జన్'', ''హారతి'', ''వ్యక్తిత్వం లేని మనిషి'' నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి [[ప్రేమ నక్షత్రం]] నవల సినిమాగా వచ్చింది. 1959 లో ''గోరింటాకు'' సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన [[ఆకాశవాణి]] కోసం ఎన్నో [[నాటిక]] లు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో ''మర మనిషి'' కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.