అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 434:
86 ధర్మమన వేడ నిగదిత
కర్మము గావించుటండ్రు ఘనులది గానన్
కర్మము ఫలమును గోరక
యర్మిలి సేయంగ ధర్మమగు నధికారీ !
87 ధర్మార్ధమైన యర్ధము
శార్మదమై సౌఖ్యమిచ్చు సకలార్ధములన్
నిర్మలత నొసగు గావున
ధర్మహితార్దార్జనంబు తగునధికారీ !
88 ధర్మార్ధ కామముల నిల
నిర్మలమతి నిర్వహింప నిఖిల శుభము లౌ
కర్మము ఫలంబు గోరక
ధర్మమునను సేయముక్తి దంబధికారీ !
89 తన ధర్మము విడనాడుట
లనయము పరధర్మములనెయాశించుటయున్
జనులకు తగదిల గావున
గననీ ధర్మంబె నీకు ఘనమధికారీ !
90 జీవులయెడ కారుణ్యము
గోవులయెడభక్తీ దేశ గురు బుధజన సం
సేవయు బరోపకారము
నీవెప్పుడు సేయవలయు నిలనధికారీ !
91 దుర్మతి గోరని కామము
ధర్మ హితంబైన సౌఖ్యదంబగుచును స
త్కర్మము నాబడు గావున
నిర్మల కామంబు తగును నీ కధికారీ !
92 నీ వదికారివే యౌటను
నే వలనను మాతృదేశ హితమునోనర్పన్
గావలెనటు సేయమి నీ
జీవితమే నిష్పలంబు క్షితి నధికారీ!
93 విను మాతృ ద్రోహంబును
గన మిత్ర ద్రోహమును జగంబున పాపం
బెనయ క్షమింపగ రానివి
యనిరి బుధుల్ బుద్ధి నేరుగుమా యధికారీ !
94 దేశ ద్రోహులు జచ్చిన
నా శునకము గూడ ముట్టదనిరి మహాత్ముల్
దేశాభిమానివై చిర
మాశాంతము కీర్తి గాంచుమా యధికారీ !
95 దీపించు గర్వమున దమ
లోపంబు లెరుంగ లేక లోభంబున దు
ర్వ్యాపారులగుచు దిరిగెడి
పాపాత్ముల గనకుమింక భారతమాతా !
96 కోపంబు మదోన్మత్తా
లాపంబు దురాశ దుష్ట లక్షణములతో
చాపల్యంబున నడచెడి
పాపాత్ముల గనకుమమ్మ భారతమాతా !
97 దేశ ద్రోహుల దుష్ట దు
రాశా పాతకుల సుజన హాసకుల దురా
వేశపరులైన మూర్ఖుల
నీశులుగా గోరకమ్మ హిందూజననీ !
98 జ్ఞానమును వీడి కలిగిన
దానికి దానంబు తగిన ధర్మంబులకున్
పూనని మదాంధు లౌమతి
హీనుల నేన్నడును గనకు హిందూజననీ !
99 సతతము బరోపకారుల
హిత సద్గుణ వినయమతుల హింసారహిత
వ్రతుల నిజ దేశ భక్తుల
ప్రతిభా వంతులను గనుము భారతమాతా !
100 మంగళము భరతమాతకు
మంగళములు బాటకులకు క్ష్మానాధులకున్
మంగళము సాధుకోటికి
మంగళములు గల్గు గాక మహినెల్లరాకున్ .
ఇది శ్రీ సకల కవిమిత్ర విష్ణువర్ధనసగోత్ర పవిత్ర శేషమాంబా సోమేశ్వర పుత్ర విభుధజన విధేయ అచ్యుతరామ నామధేయ ప్రణీతంబైన అధికారిహితోపదేశంబును సర్వంబును సంపూర్ణము.
శ్రీ శ్రీ శ్రీ
శ్రీ శ్రీ
శ్రీ
కృతి సమర్పణ
అంధ్రలక్ష్మి తోడ నధికారి కృతికన్య
శ్రీయు భూమి నాగ జెలగి ప్రేమ
నిన్నుగోరి చేరే నీవు శ్రీధరు పోల్కే
నాదరించి యేలు మాంద్ర సింహ !
వినుత వినూత నాంధ్రరమ విజ్ఞతతో ప్రధమ ప్రధానిగా
నిను వరియించి యెంతయును నేర్పునదాగ్రు తక్రుత్యయయ్యేనీ
యనుపమ శక్తి నెల్లరకు నైక్యత గూర్చి బ్రజానుకూలివై
ఘనముగ నేలు మెల్లరు సుఖంబులనందగ నాంధ్రకేసరీ !
తెలుంగు జాతి వెలుంగు వీవనుచు గాదే నిన్ బ్రకాశంబు నా
దెలియన్ బల్కుదురెల్లవారలు ధరిత్రిన్ సార్ధకాభిఖ్య నీ
విలసత్కాంతివినూత నాంధ్ర వసుధన్ వెల్గొందగా జేసి ని
శ్చల మంత్రిత్వముతోడ దేశము బ్రకాశంబందపాలింపుమా .
అల గోదావరి పొంగి ముంచేనొకచొ నాంధ్ర ప్రజావాహినుల్
తలకోక్కటిగా జరించే మరియున్ ధర్మంబు లోపిమ్చే నీ
ఇలయున్ బెక్కగు నీతి బాధలను దా నిక్కట్లపాలయ్యే మా
కల తీరీ గతినుండే దేశమున నేకత్వంబు సాధించి ని
శ్చల మంత్రిత్వము గల్గి ధర్మము ప్రకాశంబంద పాలించి ని
ర్మల కీర్తిన్ ఘటియించి జీతిని సేమంబీవు జేకూర్చుమా .
తెలియగా దేశ భాషలను తెల్గది లెస్స యటన్న యానుడిన్
నిలుపుచు నాంధ్ర భోజుడన నిర్మల కీర్తి గడించి మించుచున్
తెలుగు వెలుంగు నాగ నిల ద్రిమ్మరుసో యన రాజనీతితో
మెలగి తెలుంగు జాతికిని మేలోనగూర్పు త్రిలింగ సింగమా !
జై ఆంధ్ర
 
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు