వరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
[[భారతదేశం]] లో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. వరి గింజలనుండి [[బియ్యం]] వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం.ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే. భారతదేశంలో పంటలకు ఒరైజా సటైవా ఇండికా రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు. ఆకుమడి తయారుచేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తరువాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. వరి మొక్క ఏకవార్షికం. వరి నుండి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు. ఎండుగడ్డి, ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. ధాన్యంపై పొట్టు తీయకుండా వాటిని వేడినీటిలో ఉడికించిన తరువాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి. ఇడ్లీ, దోశ మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు. బియ్యపు పిండిని, బట్టల ఇస్త్రీలకు, కాలికో ముద్రణలోనూ ఉపయోగిస్తారు. కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. తవుడు నుండి తీసిన నూనె వంటలలో ఉపయోగపడుతుంది. హంస, ఫల్గున, జయ, మసూరి, రవి, బాసుమతి మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు.
 
==పండించే విధానం==
ముందుగా నాణ్యమైన వడ్లను విత్తనాలుగా ఎంచుకుంటారు. తరువాత మొలకలు రావడం కోసం వాటిని నీళ్ళలో నానబెడతారు. నానబెట్టేటపుడు తొందరగా మొలకలు రావడానికి వాటిలో వావిలాకు వంటివి వేస్తారు. ఈ విత్తనాలు నారు పోయడానికి ఉపయోగిస్తారు. నేల ఎంత మెత్తగా ఉంటే నారు అంత ఏపుగా ఎదుగుతుంది. అందుకోసం గింజలు మొలకెత్తుతుండగా నారు పోయడానికి ఎంచుకున్న భూమిని పలు మార్లు దున్నడం, నీటితో తడపటం, ఎరువులు వెయ్యడం లాంటి పనులు చేస్తారు.
 
మొలకలు వచ్చిన గింజలను నారు మడిలో చల్లుతారు. గింజలు మరీ పలుచనగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా చల్లుతారు. కొద్ది కాలానికి గింజలు చిన్న చిన్న వరి మొక్కలుగా ఎదుగుతాయి. తరువాత ఈ నారును ముందుగా సిద్ధం చేసుకున్న నేలలో నాటుతారు. దీన్నే నారు నాటడం అంటారు. ఈ పనిని మనుషలైనా చేయవచ్చు, లేదా యంత్ర సహాయం తీసుకోవచ్చు. నాటేటపుడు వరి మొక్కలను కుచ్చులుగా తీసుకుని ఒక్కో దానికి సరైన దూరంలో ఉండేలా నాటుతారు. దూరం తగ్గితే పంట ఎదుగుదల పెద్దగా ఉండదు. దూరం పెరిగితే పంట దిగుబడి పెద్దగా ఉండదు.
 
పైరు కొంచెం పెరగగానే మధ్యలో కలుపు మొక్కలు పెరుగుతాయి. వాటిని ఏరివేసే ప్రక్రియను కలుపుతీయడం అంటారు. మధ్యలో పైరు బాగా ఎదగడానికి, తెగుళ్ళు రాకుండా ఉండటానికి కొన్ని రసాయనిక ఎరువులు వాడతారు. వీటిని నేరుగా పొలంలో చల్లడంకానీ, పిచికారీ చేయడం పరిపాటి. గింజలు మొలకెత్తి పక్వానికి వచ్చిన తరువాత పైరు కోత ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం చాలావరకు పైరుకోత యంత్రాల సహాయంతోనే జరుగుతుంది. ఇందులో బయటకు వచ్చిన ధాన్యాన్ని ఇళ్ళకు తరలిస్తారు.
== వరి గింజ ==
[[దస్త్రం:Rice Animation.gif|thumb|250px|A: Rice with [[chaff]]</br>B: [[Brown rice]]</br>C:Rice with [[Cereal germ|germ]]</br>D: [[White rice]] with [[bran]] [[Crop residue|residue]]</br>E:Musenmai (Japanese:[[:ja:無洗米|無洗米]]), "Polished and ready to boil rice", literally, non-wash rice</br>(1):[[Chaff]]</br>(2):[[Bran]]</br>(3):Bran [[Crop residue|residue]]</br>(4):[[Cereal germ]]</br>(5):[[Endosperm]]]]
"https://te.wikipedia.org/wiki/వరి" నుండి వెలికితీశారు