నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
సాహిత్య అకాడెమీ పురస్కారాలు, జ్ఞానపీఠ్ పురస్కారాలు పొందిన ఉత్తమ గ్రంథాలను, ఇతర క్లాసిక్ పుస్తకాలను ఎంపికచేసుకుని అన్ని భాషల్లోకీ అనువాదాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుని గతంలో [[అంతర భారతీయ గ్రంథమాల]], ప్రస్తుతం [[ఆదాన్ ప్రదాన్]] పథకాలుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 32 భాషల్లో 17వేలకు పైగా పుస్తకాలు ప్రచురించారు.
== పఠనాసక్తికి ప్రోత్సాహం ==
దేశమంతటా పుస్తక మేళాలను, ప్రదర్శనలను ఏర్పాటుచేయడం ద్వారా గ్రంథాలను, గ్రంథ పఠనాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ ప్రచురణ సంస్థల వారు ప్రచురించిన పుస్తకాలను కూడా ఎంపికచేసి వాటికి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొత్తగా అక్షరాస్యులైన పాఠకులకు ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు.
 
== మూలాలు ==