నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
దేశమంతటా పుస్తక మేళాలను, ప్రదర్శనలను ఏర్పాటుచేయడం ద్వారా గ్రంథాలను, గ్రంథ పఠనాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ ప్రచురణ సంస్థల వారు ప్రచురించిన పుస్తకాలను కూడా ఎంపికచేసి వాటికి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొత్తగా అక్షరాస్యులైన పాఠకులకు ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. రెండేళ్ళకొకమారు ట్రస్టు ద్వారా విశ్వ పుస్తక వేదికను న్యూఢిల్లీలో ఏర్పాటుచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అతి పెద్ద పుస్తక మేళాగా ఖ్యాతిపొందిన ఈ విశ్వపుస్తక ప్రదర్శనను 1972లో ప్రారంభించారు. తాజాగా 2013 ఫిబ్రవరి-మార్చి నెలల్లో 20వ విశ్వ పుస్తక ప్రదర్శన నిర్వహించారు.
== పుస్తక మహోత్సవాలు ==
ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ స్థాయిలో ఏటా పుస్తక మేళాలు, పుస్తక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. జాతీయ పుస్తక మేళాలు అహ్మదాబాద్, ఇండోర్, కోల్ కతా, చెన్నై, చండీఘర్, జైపూర్, తిరువనంతపురం, నాగపూర్, లక్నో, న్యూఢిల్లీ, బెంగళూరు, పాట్నా, భోపాల్, ముంబై, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించారు. ఇవే కాక బాలల పుస్తక మేళాలు, ప్రాంతీయ పుస్తక మేళాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకు ఎన్.బి.టి. చొరవతో జాతీయ పుస్తక వారోత్సవాలు విద్యాసంస్థలు, ప్రచురణ సంస్థలు, సాహిత్య సంస్థలు, స్వచ్చంద సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా చేస్తున్నారు.
 
== మూలాలు ==