నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
విదేశాల్లో భారతీయ సాహిత్యాన్ని ప్రచారం చేయడం కోసం అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనల్లో పాల్గొని ప్రదర్శిస్తున్నారు. అనేకమంది భారతీయ ప్రచురణ కర్తలు ప్రచురించిన వాటిలో ఎంపికచేసిన గ్రంథాల ప్రదర్శనలను, విదేశాల్లో మరీ ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 1970 నుంచి ఇప్పటివరకూ 350కి పైగా అంతర్జాతీయ పుస్తకాల పండుగల్లో పాల్గొన్నారు. ఏటా ఫ్రాంక్ ఫర్డ్, బొలానా, జింబాబ్వే, టోక్యో, కొలంబో, బాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్, మనీలా, కరాచీ మొదలైన అంతర్జాతీయ పుస్తక మేళాల్లో పాల్గొంటున్నారు. యునెస్కో, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంఘం 2003-04 సంవత్సరంలో ఢిల్లీని విశ్వపుస్తక రాజధానిగా ఎంపికచేసి గౌరవించారు. అలెగ్జాండ్రియా, మాడ్రియో నగరాల తర్వాత మూడో స్థానాన్ని ఢిల్లీ దక్కించుకుంది. 2006లో ఫ్రాంక్ ఫర్డ్ పుస్తక ప్రదర్శనలో భారతదేశాన్ని ఆతిథ్యదేశంగా ఎన్నికచేశారు. నేబుట్ర ఈ గౌరవాలు దేశానికి లభించేందుకు తన వంతు కృషి చేసింది.
== రచయితలు, ప్రచురణకర్తలకు ఆర్థిక సహాయం ==
ఉన్నత విద్యాభ్యాసానికి ఉపయోగపడే గ్రంథాలను ప్రచురించి సరైన ధరలకు పాఠకులకు అందించడాన్ని ప్రోత్సహించడం కోసం పాఠ్యపుస్తకాలకు, రిఫరెన్స్ పుస్తకాల రచయితలకు, ప్రచురణకర్తలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఉత్తమ గ్రంథాల ప్రచురణకు సబ్సిడీ పథకం ఇస్తున్నారు. ఈ ప్రణాళిక కింద 900కు పైగా గ్రంథాలను ప్రచురించారు.
 
== మూలాలు ==