సాహిత్య అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
భారతీయ సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారంగా పరిగణించే ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సాహిత్య అకాడమీ సాహిత్యవేత్తలకు అందిస్తోంది. రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషలలో సాహిత్యసేవ చేసినవారికి ఈ పురస్కారాన్ని ఏటా పలు భాషల్లో అందజేస్తోంది. 1955 నుంచి ఏటా అందజేస్తున్న ఈ పురస్కారాలు తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషల్లో అందజేస్తారు. ఈ పురస్కారంతో పాటు మొదట రూ.5వేలు అందజేసేవారు. ఆ నగదు బహుమతి క్రమంగా పెరుగుతూ 2009 నాటికి రూ.లక్షకు చేరుకుంది.
==== భాషానమ్మాన్ పురస్కారం ====
సాహిత్య అకాడెమీ జాబితాలో లేని రాజ్యాంగం అధికారికంగా గుర్తించని భాషలలో సాహిత్యం కోసం కృషిచేసిన సాహిత్యవేత్తలకు భాషాసమ్మాన్ పురస్కారాలు ఇస్తున్నారు. భాషావైవిధ్యం కలిగిన విస్తారమైన దేశంలో తాము చేయవలిసిన పని ఇంకా ఉందనే దృష్టితో సాహిత్య అకాడమీ ఈ పురస్కారాలు అందజేస్తోంది. 1996లో ఆయా భాషల అభివృద్ధికి కృషిచేసిన రచయితలు, పండితులు, సంపాదకులు, అనువాదకులు, సేకర్తలు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
 
== సహాయక భాషలు ==
"https://te.wikipedia.org/wiki/సాహిత్య_అకాడమీ" నుండి వెలికితీశారు