"యు.ఆర్.అనంతమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

1970లో [[మైసూరు]] విశ్వవిద్యాలంలో మొదట ఇంగ్లిసు విభాగంలో/శాఖలో ఉపన్యాసకుడిగా చేరి,అటుపిమ్మట అక్కడే ప్రాధ్యపకుడు అయ్యాడు.తదనంతరం క్రీ.శ.1982 లో [[కేరళ]]రాష్ట్రంలోని [[కొట్టాయం]] లోని [[మహాత్మగాంధి]] విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా చేరారు.1992-93 సంవత్సరంలో [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]]కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు.అలాగే 1993లో [[కేంద్ర సాహిత్య అకాడెమీ]] కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు.కేంద్ర సాహిత్య అకాడెమికి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.
 
అనంతమూర్తిగారు దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అద్యాపకుడిగా పనిచేశారు.జర్మనిలోని తూబింగెన్ విశ్వవిద్యాలయం,[[అమెరికా]] లోని ఐయోవా మరియు టఫట్సు విశ్వవిద్యాలయాలలో,జవహారలాల్ విశ్వవిద్యాలయం మరియు [[కొల్లాపూర్]] లోని శివాజి విశ్వవిద్యాలయం లలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు.మంచి రచయిత,వక్త అయిన అనంతమూర్తిగారు ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపింఛారు.1980 లో భారతీయ రచయిత సంఘసభ్యుడిగా [[ రష్యా| సోవియట్ రష్యా ]],పశ్చిమ [[జర్మనిజర్మనీ]],మరియు [[ఫ్రాన్స్]] దేశాలను సందర్శించాడు.మార్కుస్ వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్పూర్తినిచ్చి,సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడయ్యి,1989లో మళ్ళొ రష్యా పర్యటన చేశారు.1992లో చైనా దేశాన్నికూడా సందర్శించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1024860" నుండి వెలికితీశారు