అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మదనపల్లె తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17:
ఆమెకు తన 19వ సంవత్సరంలో ఫ్రాంక్ బిసెంటుతో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలిగిన కారణంగా ఇరువురు విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు [[చార్లెస్ బ్రాడ్ లాఫ్‍]] తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత [[చార్లెస్ నోల్టన్]] పుస్తకం [[బర్త్ కంట్రోల్]] ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్‍లాఫ్, నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.
 
1980లో1880లో అనీ బిసెంట్" హెలెనా బ్లావట్‍స్కీ" ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి [[దివ్యజ్ఞానం]] వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలిగా బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ " ను ఇంగ్లాండు లో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రాజ్యమంతటా ఆమె చేత స్థాపించబడ్డాయి. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది.
 
ఆమె భారతీయ రాజకీయాలలో కూడా ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో ఆమె హోం రూల్ లీగ్ స్వాతంత్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం మరియు దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలను 1933లో ఆమె మరణించే వరకు కొనసాగించింది.
"https://te.wikipedia.org/wiki/అనీ_బిసెంట్" నుండి వెలికితీశారు