తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
 
==సాహిత్య విశేషాలు==
''తెల్లవారవచ్చె తెలియక నా సామి'' అని పాట మొదలౌతుంది. రాత్రి అలా పడుకున్నామో లేదో ఇంతలోనే మనకు తెలియకుండానే తెల్లవారిపోయిందనే అర్ధముంది. అదే భక్తికోణంలో చూస్తే దేవదేవా! పొద్దుకు తెలియదు నీవు నిద్రపోత్తున్నట్లు అందుకే వచ్చేసింది, దాని పరువు కాపాడడానికైనా నిద్రలేవయ్యా అనే అర్ధం కనిపిస్తుంది. ''మళ్లీ పరుండేవు లేరా'' అనే పదాల్లోనూ రెండు అర్ధాలున్నాయి. కావాలంటే మళ్ళీ పడుకోవచ్చు ఇప్పుడైతే లేవరా అనేది సాధారణ అర్ధం అయితే నేనిటు లేపుతుంటే నువ్వటు పడుకుంటావేమిటనేది అంతరార్ధం. మళ్ళి - మళ్ళీ పదాల మధ్య చిన్నపొల్లు మార్పుతో ఈ అర్ధాలను సాధించారు మల్లాది. ''మారాము చాలింక లేరా'' ప్రయోగం వెనుక చిన్ని కన్నయ్యను నిద్రలేపుతున్న యశోదమ్మ వాత్సల్యం కనిపిస్తుంది. అలాగే నల్లనయ్య, నను కన్నవాడా, బుల్లితండ్రి, బుజ్జాయి అంటు అమ్మ ప్రేమతో బిడ్డను పిలుస్తుంది. ''నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలుస్తోంది రా'' అంటూ ఆ మాధవునికి మేలుకొలుపు పాడారు. ''కళ్యాణ గుణధామ లేరా'' అనే పదానికి జగత్కళ్యాణ కారకుడైన భగవంతుడు బారెడు పొద్దెక్కువరకు పడుకుంటే ఎలా మరి తప్పుకదా అంటున్నారు కవి.
 
==మూల జానపద గీతం==