రాయచోటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
'''రాయచోటి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. రాయచోటి పట్టణానికి చుట్టుపట్ల గల పల్లెప్రజలు ఇప్పటికీ రాసీడు అనే పలుకుతారు. రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది. ఈ పట్టణంలోని పురాతన వీరభద్రాలయం శైవులకు అత్యంత ప్రీతిపాత్రకరమైనది. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి నెలలో 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిని వీక్షించడానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
==దర్శనీయ ప్రాంతాలు==
==='''వీరభద్ర ఆలయం ''' ===
*'''వీరభద్ర ఆలయం ''' : రాయచోటి పట్టణంలోని వీరభద్రుడు నాగకుండల, రుద్రాక్షమాల శోభితుడై, కుడిచేత జ్ఞానమనే ఖడ్గం, ఎడమచేత అభయమనే ఖేటకం ధరించి భద్రకాళీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. అమరుల చేత పూజింపబడటంతో ఈ క్షేత్రాన్ని అమరగురు వీరేశ్వర క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రసిద్దికెక్కింది. ఆలయ కట్టడాలు చోళ రాజుల శైలిని పోలి ఉన్నాయి. రాజరాజచోళుడు వీరభద్రుడిని దర్శించుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.కాకతీయ గణపతిదేవుడు, మట్లిరాజులు, శ్రీకృష్ణదేవారాయలు ఆలయాన్ని దర్శించి అభివృద్ధి పనులు చేయించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. నవాబుల కాలంలో కొంతమంది దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రాగా మాసాపేట వాసులు అడ్డుకున్నారు. శివరాత్రికి వారి వంశస్థులే గర్భగుడిలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
====క్షేత్ర విశేశాలు====
*వీరేశ్వరుడు వీరలింగం, బకే గర్భాలయంలో ఉండటం విశేషం.
*వీరభద్రుడికి కాళ్లు సమానంగా ఉండవు. రాయచోటిలో వీరభద్రుడికి కాళ్లు సమానంగా ఉన్నాయి.
*ఆలయంలో ద్వారపాలకులుగా శ్రీనందీశ్వరుడు, మహాకాళేశ్వరుడు ఉన్నారు.
*ముఖద్వారానికి ఎడమ వైపున సూర్యభగవానుడు, 54 అడుగులు ధ్వజస్తంభం ఉంది.
*గ్రామదేవత యల్లమ్మ పూజ అనంతరం వీరభద్రుడికి పూజలు చేస్తారు.
*ఏటా మార్చి 27న, సెప్టెంబరు 14న ఉదయం ఆరు గంటలకు స్వామివారి గర్భగుడిలో సూర్యకిరణాలు విగ్రహం పాదల వద్ద పడతాయి.
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[రాయచోటి శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
"https://te.wikipedia.org/wiki/రాయచోటి" నుండి వెలికితీశారు