చెట్టుకింద ప్లీడరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
బాలరాజు( రాజేంద్ర ప్రసాద్) ఒక న్యాయవాది. ఒక డొక్కు కారు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అతనికి కేసులు వాదించడంపై పెద్దగా అవగాహన ఉండదు. కాని కేసులేమైనా దొరుకుతాయేమోనని ఆశగా ఎదురుచూస్తాడు. బాలరాజు వద్దకు సుజాత వచ్చి విషయమంతా చెప్తుంది. అప్పటి నుండి ఆకతాయిగా అల్లరిగా ఉండే, బాలరాజు ఈ కేసు పై ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ కేసు గెలిచి నేనేంటో వాళ్ళకి చూపిస్తానని అంటాడు బాలరాజు. ఈ విషయం తెలిసిన శరభయ్య బాలరాజుని చంపే ప్రయత్నం చేస్తాడు. ఒకానొక సందర్భంలో శరభయ్యకి భయపడి ఈ కేసుని వదిలేద్దామనే నిర్ణయానికి వస్తాడు బాలరాజు. సుజాత గారి దగ్గరకు వెళ్ళి, ఇదే విషయం ఆవిడకు చెబుతాడు. ఆవిడ ఏడుస్తూ బాలరాజు కాళ్ళు పట్టుకుని బాలరాజు గారు, అంత మాట అనకండి. మా బాబుని, నన్ను ఆదుర్మార్గుడి చేతిలో నుండి మమ్మలి రక్షించండి.మీరు తప్పమాకు వేరే దిక్కు లేదు. బాలరాజు ఆవిడ మాటలకు ఏ సమాధానం చెప్పలేక సరేనని చెప్పి ఆవిడని పంపిస్తాడు. బాలరాజు కేసుకు సంభంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉండగా గోపాలకృష్ణ తన ప్రాణ స్నేహితుడైన భగవంతం (కనకాల దేవదాసు) చిత్రకారుడు దగ్గరకు అప్పుడప్పుడు వెళ్ళుతుండేవాడని తెలిసి, అతని వద్దకు ఏదైనా సమాచారం లభిస్తుందేమోనని అక్కడికి వెళ్తాడు. అక్కడ బాలరాజుకి భగవంతం ద్వారా కొన్ని షాక్ కలిగించే విషయాలు తెలుస్తాయి.
కోర్టులో విచారణ జరుగుతుంది.గోపాలకృష్ణ స్నేహితుడైన భగవంతం బోనులో ఉన్నాడు. అతణ్ణి బాలారాజు ప్రశ్నలు అడుగుతున్నాడు. గోపాలకృష్ణగారు మీదగ్గరికి వస్తుండేవారు కారణం ఏమిటి? గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న తన తండ్రి సమాధి దగ్గరికి వచ్చేవాడు. భగవంతం గారు మీ స్నేహితుడికి మీకు ఏమైనా రహస్యాలేమైనా ఉన్నాయా? లేవు గాని ఒకటి మాత్రం ఉంది. చాలా కాలం తన మనసులోనే దాచుకుని ఓక రోజు తట్టికోలేక నాతో చెప్పాడు. నా దగ్గరికి దిగులుగా బాధగా వచ్చాడు. ఏమైందని అడిగితే ఓరేయ్ భగవంతం నీకన్నా నాకు ఈ లోకం లో ఆత్మీయులు ఏవరూ లేరురా. అలాంటి నీ దగ్గర కూడా ఒక్న నిజం దాచనురా.అప్పుడు నాకు 11 ఏళ్ళ వయసు శరభయ్య అనే నీచుడు మా ఇంట్లో చేరి, మా నాన్నగారి దగ్గర మంచిగా నటిస్తూ మా అమ్మని నమ్మించి మోసం చేసి ఆమెతో అక్రమ సంభధం పెట్టుకున్నాడు. ఆ విషయం ఏవరి దగ్గర చెప్పలేక ఏంతగానో బాధపడేవాణ్ణి ఆ శరభయ్యని చంపి ముక్కలుగా నరకాలనిపించేది. కాని అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణిరా ఏమి చేయ్యలేక ఏంతగానో ఏడ్చేవాడిని. ఒక రోజు ఆ శరభయ్య, మా అమ్మ మా నాన్న గారికి దొరికిపోతే మా నాన్న కత్తి తీసి చంపబోతే ఆ కత్తిని బలవంతంగా లాక్కున్ని మా నాన్నని చంపేశాడురా అని చెప్పాడు ఇది జరిగింది బాలరాజు గారు. జడ్జి గారు దీని బట్టి తెలిసిందేమంటే గోపాలకృష్ణని చంపేస్తే తన ఆస్తికి అధికారి కావచ్చనే ఆలోచనతో అతడిని అతి కిరాతకంగా హత్య చేయించాడు ఈ శరభయ్యా.. ఈ విధంగా నిజం నిరూపించబడడంతో శరభయ్యకి శిక్ష పడుతుంది. సినిమా ముగుస్తుంది.
 
==ఈ చిత్రం లోని పాటల వివరాలు==
* అల్లి బిల్లి కలలా రావే
"https://te.wikipedia.org/wiki/చెట్టుకింద_ప్లీడరు" నుండి వెలికితీశారు