అగ్నిధార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
అగ్నిధార ఖండకావ్యం 1949లో ముద్రితమైంది. సాహిత్యమేఖల సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావులు ఈ పుస్తకం తొలిముద్రణకు ప్రోత్సాహం, సహకారం అందజేశారు. దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయుధపోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. ఆ కారణంగా దాశరథి నిజాం ప్రభుత్వ పరిపాలనలో జైలు జీవితాన్ని అనుభవించారు. అగ్నిధారలోని ఖండికల్లో చాలావరకూ ఆ జైలు జీవితంలోనూ, జైలులో నుంచి బయటపడ్డ కొత్తల్లోనూ రాసినవి. నిజాం రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్ర్యం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం ప్రభుత్వ పతనం - ఈ ఘటనలు తన ఈ రచనకు పునాదులుగా కృష్ణమాచార్య పేర్కొన్నారు. యువకునిగా ఉండగా తాను రచించిన కవిత్వం కావడంతో ఈ కవితా ఖండికల్లో శృంగారం కూడా చోటుచేసుకున్నట్టు, యుద్ధారావాలతోపాటుగా శృంగార రచనలు చేయడం తన రచనకున్న రెండు లక్షణాలు అంటూ దాశరథి కృష్ణమాచార్య అన్నారు.<ref>పురాస్మృతులు(వ్యాసం):దాశరథి:26-1-1963</ref>
== గ్రంథకర్త గురించి ==
''ప్రధానవ్యాసం: [[దాశరథి కృష్ణమాచార్య]]''<br />
దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖ కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త.
 
"https://te.wikipedia.org/wiki/అగ్నిధార" నుండి వెలికితీశారు