రంతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పరిచయం కొంత
పంక్తి 1:
'''రంతి దేవుడు''' [[భాగవత పురాణం]] లో ప్రస్తావించబడిన రాజు.<ref>[http://books.google.com/books?id=2S-f6PVHPAsC&pg=PA257&dq=Ranti+deva#v=onepage&q=Ranti%20deva&f=false Hand Book of Hindu Religion and Ethics]</ref> రాజ్య పరిత్యాగం చేసి అడవిలో సన్యాసి జీవితం గడుపుతుంటాడు. రంతి దేవుని ప్రస్తావన భాగవత పురాణంతో పాటు [[మహాభారతం]]లోనూ, సంస్కృత కవి [[కాళిదాసు]] రచించిన [[మేఘదూతం]]లోనూ ఉన్నది. రంతిదేవుని రాజధాని రంతిపురం. ఇది [[చంబల్]] ప్రాంతంలోని ఆధునిక [[రణతంబూరు]]గా పరిగణించబడుతున్నది.<ref>[http://books.google.com/books?id=wyErlJ0SfggC&pg=PA74&dq=Ranti+deva#v=onepage&q=Ranti%20deva&f=false The Geographical Dictionary of Ancient and Mediaeval India: With an Appendix By Nundo Lal Dey]</ref> చంబల్ ప్రాంతం, [[రాజస్థాన్]], [[ఉత్తరప్రదేశ్]] మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రాలు మూడూ కలిసే ప్రాంతంలో ఉన్నది.
[[రంతి దేవుడు]] [[భాగవత పురాణం]] లో ప్రస్తావించబడిన ఒక గొప్ప రాజు. రాజ్య పరిత్యాగం చేసి అడవిలో సన్యాసి జీవితం గడుపుతుంటాడు.
 
ఒక రోజు రంతి దేవుడు 48 రోజుల పాటు వరుసగా [[ఉపవాసం]] ఉంటాడు. 49 వరోజు కొద్దిగా [[అన్నం]] వండుకుంటాడు. దాన్ని ఆరగించేలోగా ఒక పేదవాడు ఆకలితో ఆయన్ను సమీపించి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటాడు. రంతి దేవుడు సంతోషంగా కొంత అన్నం అతనికి సమర్పించుకుంటాడు. అతను ఆ అన్నం తినేసి తన దారిన వెళ్ళిపోతాడు. రంతిదేవుడు రెండో సారి ఆరగించడానికి ఉద్యుక్తుడవుతుండగా ఇంకా ఇద్దరు పేద వాళ్ళు వచ్చి అన్నం కోసం అడుగుతారు. వాళ్ళకు కూడా సంతోషంగా సమర్పించుకోగా ఇంక కొంచెం అన్నం మాత్రమేమిగిలి ఉంటుంది. ఆ సమయానికి ఒక [[కుక్క]] అక్కడికి వచ్చి తన తోకనాడిస్తూ అన్నం కోసం చూస్తుంది. మిగిలిన అన్నమంతా దానికి సమర్పించిన రంతిదేవుడు ''నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది'' అనుకుంటాడు.
 
మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/రంతి_దేవుడు" నుండి వెలికితీశారు