జలగం వెంగళరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి తుర్లపాటిగారి ఆత్మకథ మూలం వనరుగా చేర్చు
పంక్తి 30:
తన 20 వ ఏట [[నిజాము]]కు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. 1952 లో [[శాసనసభ]] కు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. [[1952]] నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. [[1962]]లో కాంగ్రెసు పార్టీ తరపున [[ఖమ్మం జిల్లా]] [[సత్తుపల్లి]] నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తరువాత [[1978]] వరకు మరో మూడు సార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. [[1967]]లో పంచాయితీరాజ్‌ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.
 
[[కాసు బ్రహ్మానంద రెడ్డి]] మంత్రివర్గంలో [[1969]] నుండి [[1971]] వరకు హోం మంత్రిగాను, [[పి.వి.నరసింహారావు]] మంత్రివర్గంలో [[1972]]-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు. [[జై ఆంధ్ర]] ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన [[రాష్ట్రపతి పాలన]] ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు<ref name=turlapati>{{Cite book|url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%95%E0%B0%B2%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81#.E0.B0.9C.E0.B0.B2.E0.B0.97.E0.B0.82_.E0.B0.B5.E0.B1.86.E0.B0.82.E0.B0.97.E0.B0.B3.E0.B0.B0.E0.B0.BE.E0.B0.B5.E0.B1.81_.E0.B0.AE.E0.B1.81.E0.B0.96.E0.B1.8D.E0.B0.AF.E0.B0.AE.E0.B0.82.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BF.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B5.E0.B0.82|title= నా కలం - నా గళం(జలగం వెంగళరావు ముఖ్యమంత్రిత్వం)|accessdate=2014-03-01 |first=కుటుంబరావు|last=తుర్లపాటి |date=2012 పిభ్రవరి}}</ref>.. ఆయన పాలనా కాలంలోనే [[ఇందిరా గాంధీ]] దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి)ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:
 
#నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
పంక్తి 42:
 
==వనరులు, మూలాలు==
{{మూలాలజాబితా}}
*[http://www.idlebrain.com/celeb/interview/interview_gudipoodi.html తెలుగు సినిమా పరిశ్రమకు జలగం సేవ- గుడిపూడి శ్రీహరి ఇంటర్వ్యూ]
*[http://www.eci.gov.in/ElectionAnalysis/AE/S01/partycomp277.htm సత్తుపల్లి నియోజకవర్గంలో జలగం విజయాలు]
"https://te.wikipedia.org/wiki/జలగం_వెంగళరావు" నుండి వెలికితీశారు