విద్యాపతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
విద్యాపతిగా సుప్రసిద్ధులైన విద్యాపతి ఠాకూర్ మైథిలి భాషా కవులలో అగ్రగణ్యుడు. ఆయన పశ్చిమబెంగాల్ సరిహద్దున గల తూర్పు బీహార్ ప్రాంతంలో నివసించే లక్షలాది ప్రజలు మాట్లాడుకునే మైథిలి భాషలో విద్యాపతి కవిత్వం చెప్పారు. మైథిలి భాషీయులైన కవులు కూడా ఇతర భాషల్లో కవిత్వం చెప్పే రోజుల్లో ఆయన మైథిలి భాషలోనే అసంఖ్యాక భక్తి పదాలు, అనేక గ్రంథాలు రచన చేసి మైథిలి సాహిత్య వైతాళికునిగా నిలిచారు.
== వంశ చరిత్ర ==
విద్యాపతికి 6 తరాల ముందువాడైన కర్మాదిత్యుడు మొట్టమొదటగా మిథిలా రాజ్యానికి మంత్రిగా చేరారు. ఆపైన కర్మాదిత్యుని కొడుకు దేవాదిత్యుడు, మనవడు వీరేశ్వరుడు, మునిమనవడు చండీశ్వరుడు మైథిలి రాజ్యానికి మహామంత్రులుగా పనిచేశారు. చండీశ్వరుడు మంత్రిగా పనిచేసిన కాలంలో వీరేశ్వరుని మరో కుమారుడు గణేశ్వరుడు సామంతరాజుల మండలికి అధ్యక్షునిగా మహాసామంతాధిపతి పదవిని, రాజాధిరాజ బిరుదాన్ని పొందారువహించారు.
"https://te.wikipedia.org/wiki/విద్యాపతి" నుండి వెలికితీశారు