బీబి నాంచారమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
[[దక్షిణ భారతదేశం]]లో ప్రచారంలో ఉన్న జానపదాల ప్రకారం '''బీబి నాంచారమ్మ''' లేదా '''తుళుక్క నాచ్చియార్''' (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య.
"బీబీ" అనేది ఉర్దూ పదం. "నాంచారి" తమిళం. రెండింటికీ ఒకటే అర్ధం. ఈ "బీబీ నాంచారమ్మ" గురించి వివిధ కధలుకథలు ప్రచారంలో ఉన్నాయి. బీబీ నాంచారమ్మకి [[కనకదుర్గ]] ఆడపడచు అట.<ref>1980-1990వరకు 9వ తరగతి తెలుగు నాన్ డిటైల్డ్ లో పాఠం </ref>. భూదేవి బీబీ నాంచారిగా అవతారమెత్తి శ్రీహరికోసం వెతుకుతూ వచ్చిందట. <ref>అలమేలుమంగా విలాసం http://www.hindu.com/fr/2007/06/01/stories/2007060152210300.htm </ref> నాంచారమ్మ వృత్తాంతము ఒక జానపద కథ అని, భారతదేశాన్ని మహమ్మదీయుల పాలించిన కాలంలో తిరుమల దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రలనుండి రక్షించడానికి ఈ కథను సృష్టించారని భావిస్తున్నారు. 1780లో చంద్రగిరిని పట్టుకొన్న [[హైదరాలీ]] తిరుమల సంపదను కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఈ కధలేననికథలేనని ఒక అభిప్రాయం. బీబీ నాంచారమ్మ కథను విశ్వసిస్తూ చాలామంది మహమ్మదీయులు నేటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు.
తుళుక్క నాచ్చియార్ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలో రంగనాథాలయంలోనూ, మేళ్కోటెలోని చెళువనారాయణస్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది. శ్రీరంగంలో రంగనాధుని ఆలయంలో తుళుక్కు నాచియార్ గుడి ఉంది. వైష్ణవానికి రాజధాని అయిన శ్రీరంగంనుండి తిరుమలకు ఎగుమతి అయిన దేవతలలో బహుశా బీబీనాంచారమ్మ ఒకరు.
 
"https://te.wikipedia.org/wiki/బీబి_నాంచారమ్మ" నుండి వెలికితీశారు