మనిషికో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 16:
imdb_id=0339350}}
 
'''మనిషికో చరిత్ర''' నాలుగిళ్ళ లోగిలిలో కాపురముండే నాలుగు మధ్య తరగతి కుటుంబాల సమస్యల చుట్టూ తిరిగే కధాంశంతోకథాంశంతో రూపుదిద్దుకొన్న తెలుగు సినిమా. ఇది మంచి విజయం సాధించింది. ఇందులో [[గణేష్ పాత్రో]] రచన, [[కోడి రామకృష్ణ]] దర్శకత్వంతో పాటు [[గొల్లపూడి మారుతీరావు]] నటన, సంభాషణలు మంచి ప్రజాదరణ పొందాయి. ఫార్ములా కధలకుకథలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది.
 
==సంక్షిప్త కధకథ==
నాలుగిళ్ళ నడవాలో నాలుగు కుటుంబాలు కాపురముంటాయి. అందులో ఒక జంట (మురళీ మోహన్, సుహాసిని) చాలీచాలని సంపాదనతో సతమతమవుతుంటారు. మురళీమోహన్‌కు సంపాదన తక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. భార్యతో ఉద్యోగం చేయించడం, ఆమె పుట్టింటి నుండి సహాయం అందుకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఒక చిన్నగదిలో ఉండే బడిపంతులు (హేమసుందర్?) కాపురమంతా భార్యకు ఉత్తరాలు వ్రాయడానికే పరిమితం. అతనొక చోట, అతని భార్య మరొక చోట ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరో ఒకరికి బదిలీ కావాలని అతను ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరొక జంట (చంద్ర మోహన్, ప్రభ) ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో అక్కడ వారే కాస్త స్థితిమంతులు. ఉద్యోగం మానేసి చక్కగా పిల్లలను పెంచుకొంటూ సంసారం చేయాలని ప్రభ కోరిక. భార్య తెచ్చే సంపాదన విలువ తెలిసిన చంద్రమోహన్ అందుకు ఒప్పుకోడు. ధారాళంగా వరండాలో కూర్చుని భార్య జాకెట్టుకు హుక్కులు కుట్టడం అతనికి చిన్నతనం అనిపించదు.
 
 
ఇక నాలుగో కుటుంబం ఈ కధలోకథలో కేంద్రస్థానం ఆక్రమిస్తుంది. గెద్దముక్కు పంతులు (లేదా మరో పేరు - సరి చూడాలి)గా గొల్లపూడి మారుతీరావు, అతని భార్యగా అన్నపూర్ణ నటించారు. ఇంట్లో ఒక్కో సామాను అమ్మేస్తూ అన్నపూర్ణ సంసారం నెట్టుకొస్తుంటుంది. గొల్లపూడి మారుతీరావు పనీపాటా లేకుండా పొద్దస్తమానం వార్తా పత్రికలు తిరగేస్తూ ప్రపంచంలోని సకల వ్యవహారాలనూ పరిశిలించి చర్చిస్తుంటాడు. తన మెలిక సంభాషణలతో అందరి తలలూ తింటుంటాడు. వారి కొడుకు కూడా పనీపాటా లేకుండా తన అభిమాన హీరో ఫంక్షనుల కోసం పొద్దస్తమానం ఖాళీలేకుండా తిరుగుతుంటాడు. ఇంట్లో బిందెలమ్మేసి హీరో ఫంక్షనులకు డబ్బు సమకూర్చుకొంటుంటాడు. వారి కూతురు దుర్గ (పూర్ణిమ) షుమారు పద్ధెనిమిదేళ్ళ పిల్ల. ఇంట్లో పరిస్థితులను అర్ధం చేసుకొంటుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/మనిషికో_చరిత్ర" నుండి వెలికితీశారు