మాతృగయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 15:
 
== మాతృశ్రాద్ధం ==
మహావిష్ణుమూర్తి అవతారమైన కపిలమహర్షి ఇక్కడ జన్మించాడు. ఆయన తన తల్లికి జ్ఞానబోధ చేసి ఆమె మరణించిన తరువాత శ్రాద్ధకర్మలు నిర్వహించాడు. ఆ కారణంగా ఇది అతి పవిత్ర స్థలంగా భావించబడుతుంది. కృతయుగం నుండి ఇది ఉన్నట్లు పురాణ కధనాలుకథనాలు వర్ణిస్తున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించారు కనుక ఇది అతి పురాతనమైన ప్రదేశంగా భావించబడుతుంది. త్రేతా ద్వాపర యుగములలో ప్రస్తావించబడిన మహర్షి పరశురాముడు తన తల్లికి ఇక్కడ శ్రాద్ధకర్మలు ఆచరించాడు. ఇక్కడ పరశురాముడు శ్రాద్ధకర్మలు ఆచరిస్తున్న భంగిమలో పరశురామాలయంలో ప్రతిష్టించబడి ఉంది. ఇక్కడ హిందువులు ఆడవారికి మాత్రమే శ్రాద్ధకర్మలు ఆచరిస్తారు. స్త్రీలు కూడా ఇక్కడ తమ మాతృమూర్తికి శ్రాద్ధకర్మ నిర్వహించవచ్చు అన్నది ఇక్కడి విశేషం. దేశంలో హిందూ స్త్రీలు శ్రాద్ధకర్మలు ఆచరించడం ఈ ప్రదేశంలో మాత్రమే.
== ఆలయాలు ==
బిందుసరోవరం తీరాన ఉన్న ఆలయాలలో కపిలమహాముని ఆలయం, కర్ధమప్రజాపతి ఆలయం, దేవభూతి ఆలయం, గయగధాధర ఆలయాలు ఉన్నాయి. ఎదురుగా శివాలయం ఉంది. ఆవరణలో రావిచెట్టు ఉంది. అక్కడ యాత్రికులు దేవభూతిని ఆరాధిస్తారు. పరశురామాలయం కూడా ఒక వైపున ఉంది.
"https://te.wikipedia.org/wiki/మాతృగయ" నుండి వెలికితీశారు