వంశధార: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
'''వంశధార నది''' [[ఒరిస్సా]] రాష్ట్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఇందులో 150 కిలోమీటర్లు ఒరిస్సా లో వుంది. [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[శ్రీకాకుళం]] జిల్లా వద్ద ప్రవేశించి [[కళింగపట్నం]] అనే చోట [[బంగాళా ఖాతము]] లో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుంది. [[గొట్టా]] (శ్రీకాకుళం జిల్లా) అనే ప్రదేశం లో దీని ఏకైక [[ఆనకట్ట]] వుంది.
 
==వంశధారానది ఒక కధనంకథనం==
[[శ్రీకాకుళం జిల్లా]] లో ప్రవహించే వంశధారానదియొక్క ఒక పాయకు కల కధనంకథనం ప్రకారం దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను. అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను.
 
==ఆంధ్రకు అదనపు నీరు==
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు