పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 42:
==బాల్యం, నటనా ప్రవేశం==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]] లో [[1912]] లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో [[1935]]లో [[హరిశ్చంద్ర]] తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.
==పేరు తెచ్చిన సినిమాలు, విశేషాలు==
[[ద్రౌపదీ వస్త్రాపహరణం]], [[హరిశ్చంద్ర]], [[పాదుక]], [[చంద్రిక]], [[కనకతార]], [[పల్నాటి యుద్ధం]], [[గృహలక్ష్మి]] , [[అనార్కలి]], [[దక్షయజ్ఞం (1962 సినిమా)|దక్షయజ్ఞం]] , [[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]], [[కృష్ణ కుచేల]], తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.
[[ఎం.జి.రామచంద్రన్]], [[ఎన్.ఎస్.రాజేంద్రన్]], [[శివాజీగణేశన్]], [[నాగయ్య]], పి.యు. చిన్నప్ప, [[నందమూరి తారక రామారావు]], తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.
సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త [[కడారు నాగభూషణం]], ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారుమ్రోగుతుండేవి. ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ [[1964]] లో [[మే 7]] వ తేదీన తుదిశ్వాస వదిలింది.
===మరికొన్ని విశేషాలు ===
[http://www.telugupeople.com/cinema రావికొండలరావు రచననుండి]
* ‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘చండిక’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
|