సత్య నాదెళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 32:
 
==మైక్రోసాఫ్ట్ ప్రస్థానము==
క్రికెట్ అంటే ఇష్టపడే సత్య, 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. రెండావ సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. స్వతంత్ర డెరైక్టర్ జాన్ థాంప్సన్ చైర్మన్‌గాఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు [[బిల్ గేట్స్]] టెక్నాలజీ సలహాదారుడుగా వ్యవహరిస్తారు. సంస్థ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు.. డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నాటికి సంస్థ మార్కెట్ విలువ 31,400 కోట్ల డాలర్లు.
 
మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్‌నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్‌లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్‌లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌లే ఇంతవరకూ సీఈవోలుగా పనిచేశారు. ఇప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవో.
"https://te.wikipedia.org/wiki/సత్య_నాదెళ్ల" నుండి వెలికితీశారు