సిరివెన్నెల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 23:
'''''సిరివెన్నెల''''' [[1986]]లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. భారతీయుల సంగీత కళ ని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి [[కె.విశ్వనాథ్]] దీనికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా
తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం లోని పాటలన్నీ చిరకాలం గుర్తుండిపోయే స్ధాయిలో ఉంటాయి. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి | సీతారామశాస్త్రి]] ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. [[కె.వి.మహదేవన్]] సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] తన వేణునాద సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న '''విధాత తలపున ప్రభవించినది...''' ( ఈ పాటను రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టింది) అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో '''చందమామ రావే జాబిల్లి రావే ...''', '''ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడదిచ్చే వాడినేమి అడిగేదీ''', '''ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు''', '''మెరిసే తారలదే రూపం''' తదితర గీతాలు విశేషంగా అలరించాయి. ముఖ్యంగా "చందమామ రావే" పాటలో అంధ బాలికకు చంద్రదర్శనం చేయించినట్లుగా చిత్రీకరించిన తీరు కళాతపస్వి దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆలాగే '''ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు''' పాట చిత్రీకరణ కూడా అంతే స్ధాయిలో ఉంటుంది. ఒక సన్నివేశంలో మంట వేడి పెరుగు తరుగుదలల ఆధారంగా సంగీత స్వరాలను పలికించే ఒక పోటీ సందర్భంగా వేణువుతో పలికించిన సంగీతం అద్భుతం.
|