సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
[[Image:Panchvatistha Ram.jpg|left|thumb|పర్ణశాలలో సీతారామలక్ష్మణుల జీవనం]]
దశరధుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు, అత్తలు వారించినా వినకుండా సీత పట్టు బట్టి "నిన్ను విడచి నేనుండలేను. అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా నాకు హంసతూలికా తల్పంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను." అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరింది. అన్నను, వదినను అంటిపెట్టుకుని సేవించడానికి లక్ష్మణుడు బయలుదేరాడు. అప్పుడు రామునకు 25 సంవత్సరములు, సీతకు 18 ఏళ్ళు, లక్ష్మణుడు 16 ఏండ్లవాడు. <ref> http://www.newdharma.org/royal_chron.htm </ref>
సీతారాములు చిత్రకూట పర్వతం, మందాకినీ నది అందాలను చూసి మురిసిపోతూ వనవాసం గడుపసాగారు. భరతుడు వచ్చి అన్నపాదుకలు తీసికొని వెళ్ళిన తరువాత సీతారామలక్ష్మణులు [[అత్రి]] మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సీత [[అనసూయ (1936 సినిమా)|అనసూయ]]ను పూజించింది. అనసూయ సీతకు అనేక పాతివ్రత్య ధర్మాలను ఉపదేశించి, మహిమగల పూలదండ, చందనం, వస్త్రం, ఆభరణాలు బహూకరించింది. సీతనోట సీతాస్వయంవరకధసీతాస్వయంవరకథ విని అనసూయ మురిసిపోయింది.
 
 
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు