సేలం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 48:
 
== ప్రారంభ చరిత్ర ==
కొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే ''హాయ్'' లేదా ''శల్య'' లేదా ''సయిలం'' అనే పదాలనుండి ''సేలం'' అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది. సేలం మరియు పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో [[చేర]] మరియు [[కొంగు]] రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడు కు చెందిన '''కురునిల మన్నర్గళ్''' అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు. స్థానిక జానపదకధలజానపదకథల ప్రకారం [[తమిళ]] కవయిత్రి [[అవ్వయ్యార్]] సేలం లోనే జన్మించింది. [[గంగా వంశానికి]] చెందిన శాసనాలు ఈ జిల్లా లోని ప్రదేశాలలో దొరికాయి. ఈ నగరము [[కొంగు నాడు]] మధ్యలో ఉన్నది.
 
తరువాత సేలం [[పశ్చిమ గంగా రాజవంశం]]లో భాగమయి, చాలా కాలం గంగాకులం పాలకులు చేత పరిపాలించబడింది. [[విజయనగర సామ్రాజ్యము]], దక్షిణ దండయాత్రలో భాగంగా తమిళనాడుని ఆక్రమించినప్పుడు, సేలం మధురై నాయకుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత, సేలంకు చెందిన '''గట్టి ముదలిలు''' [[పోలిగర్]] లు పరిపాలించి, కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మరియు కోటలను నగరం లోపలా బయటా నిర్మించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, [[మైసూర్]]-[[మధురై]] యుద్ధం అని పిలవబడే దీర్ఘకాల వైరం తరువాత సేలం [[హైదర్ అలీ]] అధీనంలోకి వచ్చింది. తరువాత 1768 ప్రారంభంలో సేలంని హైదర్ అలీ నుండి కర్నల్ వుడ్ తీసుకున్నారు. 1772 సంవత్సరము చివరిలో హైదర్ అలీ సేలంని మళ్ళీ కైవసం చేసుకున్నారు. 1799లో [[లార్డ్ క్లైవ్]] అధ్వర్యంలో సేలం మల్లి సంకరిదుర్గ్ లో ఉన్న సైన్య దళానికి చెందిన ఒక విభాగం చేత ఆక్రమణక గురయి, 1861 వరకు, సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించేవరకు, ఒక సైన్య స్థావరం లాగ ఉండేది. మాగ్నం చౌల్ట్రి (ప్రస్తుతం మగుడన్ చావడి అని పేరు మార్చబడింది) వంటి స్థలాలు ఇక్కడ చూడవచ్చు. దీరన్ చిన్నమలై కాలములో సేలం, సంకగిరి వంటి ప్రాంతాలలో [[కొంగు]] సైన్యం మరియు బ్రిటిష్ అలైడ్ సైన్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రఖ్యాతి పొందిన [[కొంగు]] నాయకుడు '''తీరన్ చిన్నమలై''' [[సంకగిరి]] కోటలో ''ఆడి పెరుక్కు రోజు'' న ఘోరంగా ఉరి తీయబడ్డాడు. ఈ స్థలమే తరువాత బ్రిటిష్ వాళ్ల ప్రధాన సైన్య శిబిరముగా మారింది.
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు