స్త్రీవాదం: కూర్పుల మధ్య తేడాలు

వికీసోర్సు నుండి తరలించాను.
చి Wikipedia python library
పంక్తి 13:
==అబల-సబల==
స్త్రీ,_ అబలా..... సబలా?
స్త్రీని శక్తి తో పోలుస్తాం. స్త్రీ లోని విశేష లక్షణం సహనం _, భూదేవికున్నంత సహనం. ఇది ఎక్కడనుండో తెచ్చిపెట్టుకున్న లక్షణం కాదు, ప్రకృతి పరంగా తనలో ఉన్న లక్షణం. ఈ సహనంతో స్త్రీ సాధించ లేనిది లేదు. సంసారం, రాజకీయం, సంఘసంస్కరణ, చదువు, ఆరోగ్యం, శాస్త్రం, చట్టం మొదలగు క్షేత్రాలలో చదువు వల్ల వచ్చే సామర్థ్యతలతో సాధించే కార్యాలే కాకుండా అనుభవం, ధైర్యం, తెలివీ, త్యాగభావం వల్ల వచ్చే యొగ్యతలతో సాధించే కార్యాలు కూడా స్త్రీ జాతి మహిమ ను చాటి చెప్పే సందర్భాలున్నాయని అందరికీ తెలిసినదే. స్త్రీ తనని తాను సంస్కరించుకుంటూ ఇంటినీ పిల్లల్నీ, తన భాద్యతలనీబాధ్యతలనీ, బరువుల్నీ, ఇరుగుపొరుగుల్నీ అన్నీ ఒక తాటిమీద నడిపే శక్తి గలది. సహోదరిగా, భార్యగా, తల్లిగా భాద్యతలనుబాధ్యతలను నిర్వర్తించే శక్తి గలది స్త్రీ. సహజసిద్ధంగా స్త్రీ పంచి ఇచ్చే గుణం కలది. ఆహారం, సేవ, సంస్కారం, మంచిచెడుల విచక్షణా జ్ఞానం కుటుంబ సభ్యులందరికీ పంచిపెడుతూ పిల్లలని క్రమశిక్షణ లో ఉంచుతూ భావి పౌరులుగా తీర్చి దిద్దగల నేర్పరి. ఇటువంటి బరువు భాద్యతలనిబాధ్యతలని పూర్తి చేస్తూ కూడా తనని తాను అబల కాదు సబల అని నిరూపించుకోగల సమర్థురాలు అని చెప్పడానికి ఆది నుండి ఇప్పటి వరుకూ అనేక ఉదాహరణలున్నాయి. రజియా సుల్తానా, ఝాన్సీ లక్ష్మీబాయి, ధాయి పన్నా, మథర్ థెరీసా, విజయలక్ష్మి పండిత్, లక్ష్మి సహగల్, ఎనీ బిసెంట్, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ మొదలగు వారందరూ ఎటువంటి విషమ పరిస్థితులను ఎదుర్కొంటూ తమని తాము సబలలు గా నిరూపించుకున్నారో లోకవిదితమే. సునీతా విలియమ్స్, కిరణ్ బేదీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీలు మరియు అలాంటి వారు కూడా ఉదాహరణలే. ప్రతి సంపూర్ణమైన పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని తెలిసనదే. ఆ స్త్రీ వెనకాల దాగి ఉన్న ఓర్పూ, నేర్పూ, భాద్యతాబాధ్యతా, త్యాగం అనేవి దాగి ఉన్నందున పురుషుడు సఫలీకృతుడౌతున్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకోంటూ తమని తాము రక్షించుకుంటూ తమ ఇంటినీ తమ పిల్లలనీ మాత్రమే కాకుండా తమలోని సంస్కారాన్ని సాంప్రదాయాలనీ కూడా రక్షించు కుంటూ ముందుకు పోతున్న స్త్రీ జాతికి ఎంతైనా గుర్తింపు రాగదని ఆశిద్దాం.
శక్తి అంటే ఏదో బలం వల్ల వచ్చె పరాక్రమం అనిపిస్తుంది. నిజమే, కాని ఈ శక్తి సహజంగా కోమలాంగి అనిపించుకునే స్త్రీ జాతికి ఎలా చెందింది?. స్త్రీ కోమలాంగి తో పాటూ కోమలహృదయం గలది కూడానూ. దయాభావం త్యాగభావాని కి దారి తీస్తుంది. దయా భావం కోమల హృదయంలో దాగి ఉంటుంది. సర్వదా దయాభావాన్ని పోషించుతూ త్యాగానికి సిద్ధం అవడం అన్నది తపస్య తో సమానం. అందుకే "త్యాగ భావం తపస్యా ఫలం" అంటారు. స్త్రీ నిర్వహించే భాద్యతలుబాధ్యతలు, వాటి రూపప్రమాణాలూ ఎంత ముఖ్యమైనవంటే, ఒక ధర్మమైన స్త్రీ జీవితం ఒక తపస్య తో సమానమనుకోవచ్చు. తపస్యాబలం గల స్త్రీ అబల అని ఎలా చెప్పుకోవాలో? అన్నీ తెలిసియున్న స్త్రీ ఇవేళ అబలా లేక సబలా అన్న సందేహానికి కారణాలు ఉంటాయి, వాటిని వెతుక్కోని "స్త్రీ సబల" అనే మనకు తెలిసిన పూర్వ జ్ఞానమునకు ఆయువు పెంచడానికి మన వ్యవహారాలలో మార్పు తెచ్చుకుంటూ ప్రయత్నమించడమా, లేక కొత్త సందర్భాలలో పుట్టే తర్కాల ప్రశ్నలకు బలమిచ్చీ " శక్తి రూపేణ సంస్థితా" అని ఆరాధింపబడే ఈ స్త్రీ అస్తిత్వాన్ని మళ్ళీ పరిషోధించడమా?
 
 
"https://te.wikipedia.org/wiki/స్త్రీవాదం" నుండి వెలికితీశారు