తిరుచానూరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
[[ఫైలు:Padmavathi Ammavari Temple.JPG|thumb|right|పద్మావతి అమ్మవారి దేవాలయం]]
'''తిరుచానూరు''' లేదా '''అలమేలు మంగాపురం''' అనే ఊరు [[చిత్తూరు జిల్లా]] [[తిరుపతి]] పట్టణం సమీపంలో ఉంది. ఇది ''తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్'' పాలనా పరిధిలోకి వస్తుంది.
== చరిత్ర ==
==విశేషాలు==
దీనిని అలమేలు మంగా పురమని కూడ అంటారు. ఇక్కడ [[వెంకటేశ్వరుడు|వెంకటేశ్వరుని]] దేవేరి [[లక్ష్మీ దేవి]] అవతారమైన [[అలమేలు మంగ]] ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి [[కొల్హాపూర్]] వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో [[కార్తీక శుక్ల పంచమి]] నాడు శుక్రవారం, [[ఉత్తరాషాఢ]] నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.
"https://te.wikipedia.org/wiki/తిరుచానూరు" నుండి వెలికితీశారు