"పూర్ణిమా మానె" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
డాక్టర్ పూర్ణిమ 2004 లో యు.యస్ ఎయిడ్స్ డైరక్టరుగా నియమితులయ్యారు. జండర్, హెచ్.ఐ.వి లలో అంఅర్జాతీయ నిపుణురాలిగా ఖ్యాతి గడించారు. హెచ్.ఐ.వి ప్రివెన్షన్ పాలసీ రూపకల్పనకు సారధ్యం వహించారు. ఆరోగ్య సంబంధించిన పుస్తకాలు అనేకం రాశారు. మరెన్నో పుస్తకాలను ఎడిటింగ్ బాద్యతలు చేపట్టారు.కల్చరల్, హెల్త్, సెక్సువాలిటీ అంశాల మీద పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలుగా వ్యవహరిచ్మారు.
 
ఆమె సెక్సువాలితీ, రీప్రొడక్షన్ హెల్త్ హక్కుల మీద గ్రామీణ, పట్టణ మహిళలలో అవగాహన, స్పృహ కొంతమేర పెంపొందుతున్నాయి గాని, మరింత విస్తృతంగా జరగవలసిన అవసరం ఉందని చెబుతారు. 2007 లో ఐ.రా.స లోని జనాభా నిధి సంస్థ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయ మహిళగా పూర్ణిమ అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు.
 
హైదరాబాద్ లోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో 2007, అక్టోబరు 29-31 వరకు మూడు రోజుల పాటు జరిగిన నాల్గవ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ రీప్రొడక్షన్ సెక్సువల్ హెల్త్ అండ్ రైట్స్ సదస్సులో పాల్గొని మహిళలు తమ సెక్సువల్ రీప్రొడక్షన్ హక్కులనే కాక , ఆరోగ్యంగా జివించే హక్కును పరిరక్షించుకొవాలని సందేశం యిచ్చారు.
==ఇతర లింకులు==
*The [[Bill & Melinda Gates Foundation]] has invited Purnima to contribute to their [http://www.impatientoptimists.org/Authors/M/Purnima-Mane The Impatient Optimists Blog].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1070685" నుండి వెలికితీశారు