గబ్బిలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
 
==గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వ్రేలాడుతాయి?==
పక్షులు, కీటకాలూ కూడా ఎగురుతాయి. కాని అవేవి తలక్రిందులుగా వేలాడవు. ఈ అవసరం ఒక్క గబ్బిలాలకే ఎందుకు కలిగింది? మిగిలిన పక్షులన్నీ ఎగర గలిగినప్పటికీ, అవి అవసరమైతే కాళ్లతో నడవగలవు, కాని గబ్బిలాలు బొత్తిగా నడవలేవు. వాటి కాళ్లకి నడిచే శక్తి లేదు. కనుక, ఒక చోటి నుండి మరో చోటికి కడలి వెళ్ళాలంటే ఎగరడం తప్ప గబ్బిలాలకి మరో గత్యంతరం లేదు. అవి కాస్త సేపు ఆగాలంటే , రెక్కలకి ఉన్న గోళ్ళతో ఏ చెట్టు కొమ్మనో , గోడ పగులునో పట్టుకొని తలక్రిందులుగా వ్రేలాడడమే అన్నిటికన్నా సులభమైన పని.
 
గబ్బిలం చాలా విచిత్రమైన జీవి. క్షీరదాలలో ఎగర గలిగినది ఒక్క గబ్బిలం మాత్రమే ! ఇది పిల్లలని కంటుంది. వాటికి పాలిస్తుంది. తల్లి గబ్బిలం వేటకి వెళ్తూ, పిల్లలను పొట్టకు కరచుకొని ఎగురుతూ పోతూ ఉంటుంది.ఎగిరే ఉడతలు, ఎగిరే లేమూర్'లు, ఉన్నాయి, కాని పైనుంచి క్రిందకి నెమ్మదిగా `గ్లయిడ్' అవడం తప్ప నిజంగా ఎగరడం వాటికి చేతకాదు.
గబ్బిలం రెక్కలకీ, పక్షి రెక్కలకి చాలా తేడా ఉంది. పక్షుల రెక్కలకి ఈకలు ఉంటాయి. వేళ్ళ మద్యని గొడుగు బట్టలాగ సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు గబ్బిలాలకి ఉన్నాయి. దాని వేళ్ళలో బొటన వ్రేలు తప్ప మిగిలిన గొడుగు ఉచల లాగ పని చేస్తాయి. బొటనవేలు మాత్రం పైకి పొడచుకొని వచ్చి, ఏ చెట్టు కొమ్మనో, పట్టుకోవడానికి పనికి వస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు. వీటిలో చాలా భాగం పురుగుల్ని , తింటాయి. కొన్ని పళ్ళు తింటాయి, కొన్ని పుప్పొడిని నాకుతాయి, మరికొన్ని నిద్ర పోతున్న జంతువుల రక్తం త్రాగుతాయి.
"https://te.wikipedia.org/wiki/గబ్బిలం" నుండి వెలికితీశారు