కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
పడమటి కనుమలలో సముద్రమట్టానికి 1,400 మీటర్ల ఎత్తున ఉన్న వన్యమృగ శరణాలయం 958 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. జిల్లాలోని ఉత్తర మరియు పడమర భూభాగాలలో 20% కంటే అధికమైన భూభాగం అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాలలో వాణిజ్య విలువలు కలిగిన టేకు, గంధపు చెట్లు, ఎర్రచందనం, మరియు వెదురు చెట్లు అధికంగా ఉన్నాయి.నీలగిరి మరియు మేట్టుపాళయం పర్వతాలు గంధపు చెట్లకు ప్రసిద్ధి. ఎత్తైన భూభాగం లాంటానా పొదలతో ఆక్రమితమై ఉంది. ప్రాంతీయులు వీటిని సిర్కిచెడి అని అంటారు.
 
జిల్లకు పడమటి సరిహద్దులలో [[కేరళ]] రాష్ట్రానికి చెందిన [[పాలక్కడుపాలక్కాడు]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[నీలగిరి]] జిల్లా, ఈశాన్యం మరియు తూర్పున [[ ఈరోడ్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో కేరళ రాష్ట్రానికి చెందిన [[ఇడుక్కి]] జిల్లా మరియు ఆగ్నేయ సరిహద్దులో [[దిండిగల్]] జిల్లాలు ఉన్నాయి. జిల్ల వైశాల్యం 7,649 చదరపు కిలోమీటర్లు. జిల్లా నైరుతి మరియు ఉత్తర సరిహద్దులలో ఉన్న పడమటి కనుమల పర్వతశ్రేణుల వలన జిల్లాలో సంవత్సరమంతా ఆహ్లాదమైన వాతావరణం ఉంది. [[తమిళనాడు]] మరియు [[కేరళ]] రాష్ట్రాలను వేరుచేస్తున్న పడమటి కనుమలలో రెండు రాష్ట్రాలను అలాగే కోయంబత్తూరు మరియు పాలక్కాడు జిల్లాలను పాలఘాట్ అనుసంధానిస్తున్నది. రెండు రాష్ట్రాలకు ఇది ప్రధానమైన అనుసంధానంగా ఉంది. మిగిలిన జిల్లా అంతా సంవత్సరమంతటా పర్వతశ్రేణుల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. జిల్లాలో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు 35°సెంటీగ్రేడ్ నుండి 18°సెంటీగ్రేడ్ ఉంటుంది. <ref>http://www.coimbatore.tn.nic.in/pdf/SHB002.pdf</ref> The average annual rainfall in the plains is around 700&nbsp;mm with the northeast and the southwest monsoons contributing to 47% and 28% respectively to the total rainfall.<ref>http://www.coimbatore.tn.nic.in/pdf/SHB002.pdf</ref>
 
జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనవి భవాని, నొయ్యల్, అమరావతి మరియు అలియార్ ముఖ్యమైనవి. జిల్లాకు తియ్యటి మంచినీటిని అందిస్తున్న ప్రధానవరు సిరువాణి ఆనకట్ట. కోయంబత్తూరు జిల్లాలో ఉన్న జలపాతాలలో గుర్తించతగినవి చిన్నకళ్ళర్ జలపాతం, మంకీ జలపాతం, సెంగుపతి జలపాతం, త్రిమూర్తి జలపాతం మరియు వైదేహి జలపాతం ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు