ముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి 122.169.129.222 (చర్చ) చేసిన మార్పులను కూచిమంచిప్రసాద్ య...
పంక్తి 11:
==ముగ్గు తయారీ==
ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన పిండి. సాధారణంగా ముగ్గులు పెట్టేది మామూలు పిండితో, తరువాత బట్టీల ద్వారా, నత్తగుల్లలు, ముగ్గు రాళ్ళతో ముగ్గును తయారు చేయడం మొదలెట్టడంతో దానిని అధికంగా వాడుతున్నారు.
 
==ముగ్గులు రకాలు==
[[బొమ్మ:Rangavalli.JPG|thumb|250px|రంగు రంగుల ముగ్గు.]]
; సాంప్రదాయ ముగ్గులు
మామూలు పిండితో పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.
; రంగుల ముగ్గులు
కొన్ని విశేష సంధర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి.
 
; పండుగ ముగ్గులు
సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకులతోను, [[గొబ్బెమ్మ]]లతోను అలంకరిస్తారు.
 
; చుక్కల ముగ్గు:
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
; [[రథం ముగ్గు]]
సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసె రంగుల ముగ్గులు వేసె పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడ తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల కు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులె.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ముగ్గు" నుండి వెలికితీశారు