గ్రామ దేవత: కూర్పుల మధ్య తేడాలు

చి విక్షనరీకి తరలింపు మూస
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
:ఇదే పేరుతో 1968లో వచ్చిన సినిమా గురించి '''[[గ్రామదేవతలు (సినిమా)]]''' చూడండి.
[[బొమ్మ:APvillage Ratnalakunta 3.JPG|right|thumb|250px|[[రాట్నాలకుంట]] గ్రామంలో గ్రామదేవత రాట్నాలమ్మ గుడి వెలుపల ఉన్న బోర్డుపై జంతు బలులు నిషేధింపబడినవి అని వ్రాసిఉన్నది ]]
Line 4 ⟶ 5:
గ్రామస్తులను చల్లగా చూస్తూ, [[అంటు వ్యాధి|అంటు వ్యాదుల]] నుండి రక్షిస్తూ, [[పంట]]లను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ [[పొలిమేర]]లలో సదా కాపుకాస్తుండే [[దేవత]] - '''గ్రామదేవత''' ([[ఆంగ్లం]]: '''Gramadevata''')
 
గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస , బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.
 
==గ్రామదేవతా వ్యవస్థ==
[[బొమ్మ:Peddintlamma Poster.JPG|right|thumb|250px|శ్రీ పెద్దింటి అమ్మ వారి ఆలయం గురించిన ఒక బోర్డు]]
[[గ్రామం|గ్రామాలలో]] వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అందురు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ [[దేవీ నవరాత్రులు|దేవీనవరాత్రుల]] కాలములో ఎక్కడోవున్న [[మధుర]] మీనాక్షమ్మ వద్దకో, [[కంచి]] కామాక్షమ్మ దగ్గరికో, [[బెజవాడ]] కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
 
 
ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన [[వేదాలు|వేద]], స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ [[నెల]], ఆ [[తిథి]]నాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
పంక్తి 48:
 
పార్వతే అమ్మోరు(అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజనీ అంటారు. వారిలో కొందరు....
 
 
[[దస్త్రం:Board in the gangamma temple.JPG|thumb|right|250px|గంగమ్మ గుడిలో ఒక బోర్డు]]
 
పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్తెమ్మ, తాళ్ళమ్మ, చింతాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టాలమ్మ, దక్షాయణమ్మ, పేరంటాళ్ళమ్మ, రావులమ్మ, గండి పోచమ్మ, మొగదారమ్మ, ఈరినమ్మ, దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ ([[అనకాపల్లి]], విశాఖపట్నం జిల్లా), మరిడమ్మ, నేరెళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ(మొయ్యేరు,అత్తిలిదగ్గర,ప.గోజిల్లా) , మాచరమ్మోరు, మద్ది అనపమ్మోరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క ([[అంతర్వేది]], తూ.గో.జిల్లా)(గుర్రాలమ్మ), అంబికాలమ్మ, దనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకలమ్మ, దానాలమ్మ, రాట్నాలమ్మ, తలుపులమ్మ ([[తుని]], తూ.గో.జిల్లా), పెన్నేరమ్మ, వెంకాయమ్మ, గున్నాలమ్మ, ఎల్లమ్మ ([[విశాఖపట్నం]]), పెద్దమ్మ, మంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వనువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, ధారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసాలమ్మ, పళ్ళాలమ్మ (వానపల్లి, తూ.గో.జిల్లా), ధనమ్మ, జోగులమ్మ, పైడితల్లి, చెంగాళామ్మ, రావులమ్మ, బూరుగులమ్మ, కనకమహాలక్ష్మి ([[విశాఖపట్టణం ]]), పోలమ్మ, కొండాలమ్మ, వెర్నిమ్మ, దేశిమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, దానెమ్మ, మహంకాలమ్మ, వీరుళ్ళమ్మ, మరిడమ్మ, ముళ్ళమాంబిక, యల్లారమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియలమ్మ, పెద్దింట్లమ్మ, నంగాలమ్మ, చాగళ్ళామ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ- పేరంటళ్ళమ్మ, రంగమ్మ-పేరంటాలమ్మ, వెంగమ్మ-పేరంటాలమ్మ ,తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మురుగులమ్మ ([[బండారులంక]], తూ.గో.జిల్లా), [[విశాఖపట్నం]]లో కుంచమ్మ, ఎరకమ్మ, పెద్దింట్లమ్మ,మరిడమ్మ ఉన్నారు.[[మసకపల్లి]] [[పామర్రు మండలం]] [[తూర్పు గోదావరి జిల్లా]]లోని గ్రామదేవతలు [[మసకపల్లమ్మ]] , [[వెలగలమ్మ]], ఉర్లమ్మ తల్లి (గణపవరం, కర్లపాలెం మండలం, గూంటూరుజిల్లా)పైళ్లమ్మ తల్లి, బళ్లమ్మ తల్లి, లొల్లాలమ్మ తల్లి, వూదలమ్మ తల్లి, కట్వలాంబిక,నాగాలమ్మ-నాంచారమ్మ తల్లి, సింగమ్మ తల్లి,ఘట్టమ్మ తల్లి, అంజారమ్మ తల్లి,
 
ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_దేవత" నుండి వెలికితీశారు