భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
==సినిమాలలో==
రమారమి అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో [[మల్లీశ్వరి]], [[మంగమ్మగారి మనవడు]] వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. [[విజయా]] వారి [[మిస్సమ్మ]] సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత [[చక్రపాణి]]కి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో [[సావిత్రి]] ని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి ''నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది,'' అని సంతోషించింది{{fact}}.
 
 
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు