ముట్నూరి కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
 
==జీవిత విశేషాలు==
"[[కృష్ణా పత్రిక]]" సంపాదకులు గా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరుగ్రామం లో జన్మించారు. ఈయన పుట్టగానే తల్లి గతించింది. బాల్యంలోనే తండ్రి పరిమపదించడం వళ్ల పినతండ్రి ప్రాపకములో పెరిగాడు. ఈయన ప్రాధమిక విద్యాభ్యాసం [[బందరు]]లోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత బందరులోనే నోబుల్ కళాశాలలో ఎఫ్.ఏ కోర్సులో చేరాడు. ఇక్కడే ఈయనకు [[రఘుపతి వెంకటరత్నంనాయుడు]] యొక్క శిష్యుడయ్యే అవకాశం కలిగింది. నాయుడు యొక్క సంఘసంస్కరణశీలన, మూఢాచార నిర్మూలణ వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి బ్రహ్మసమాజములో ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వటం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్ధిగా తీర్చిదిద్దటమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంధ్ర పత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి కృష్ణాపత్రికనుండి తమపత్రికకు ఆకర్షించ ప్రయత్నించాడు. మరోవైపు పట్టాభి సీతారామయ్య కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతము కృష్ణాపత్రికలోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశాడు.
 
బందులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి.ఎ. చేరాడు. ఇక్కడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యాడు. కృష్ణారావు సంస్కృత సాహిత్యంతో పాటు ఆధునిక ఆంగ్ల సాహిత్యాన్ని కూడా అభ్యసించాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కూపర్ ల వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవాడు. కానీ బి.ఎ ఉత్తీర్ణులు కాలేదు. 1903లో బందరు తిరిగివచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరి, 1907లో సంపాదకుడైనాడు. అప్పటినుండి 1945లో మరణించేవరకు ఆ పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. మట్నూరి కొంతకాలం ఆంధ్ర భారతి అనే సాహిత్య పత్రికను కూడా నిర్వహించాడు.
పంక్తి 13:
 
[[దస్త్రం:Mutnuri Krishna Rao.jpg|thumbnail|ఎడమ|మట్నూరి కృష్ణారావు చిత్రపటం]]
 
==మూలాలు==
*ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు - ఎం.దత్తాత్రేయశ్రర్మ, శ్రీరామ సిద్ధాంతి ప్రచురణలు, (1992) పేజీ.5-6 [http://www.archive.org/download/mutnurikrishnara021588mbp/mutnurikrishnara021588mbp.pdf]