నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
ఇది సర్వసాధారణమైన రెండుచేతులను కలిపి నమస్కారం అనటం.
== ప్రవరతో నమస్కారం ==
'''''ప్రధాన వ్యాసం'''''
భారతదేశ వ్యాప్తంగా హిందూమత సంబంధమైన విధులు నిర్వర్తించేప్పుడు, మతాచార్యుల ఎదుట, భగవంతుని ముందు ప్రవర చెప్పి నమస్కరిస్తూంటారు. ''చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతి. <గోత్రనామం> గోత్రస్య <వంశానికి చెందిన ముగ్గురు ఋషుల పేర్లు> త్రయార్షయ ప్రవరాన్వితః <గృహ్యసూత్రం పేరు> సూత్రః <అభ్యసించే వేదం> శాఖాధ్యాయీ <నమస్కరిస్తున్న వారి పేరు> అహంభో అభివాదయే'' అంటూ నమస్కరించడం వైదిక విధానం. చేతి వేళ్లను చేవుల వెనుకకు చేర్చి ముందుకు కాస్త వంగిన భంగిమలో పై సంస్కృత వాక్యాన్ని ఉచ్చరిస్తారు. మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సివస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు.
 
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు