భావరాజు నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భావరాజు నరసింహారావు''' (1914 - 1993) ప్రముఖ రచయిత, ప్రచురణకర్త మరియు పత్రికా సంపాదకులు.
 
వీరు 10 అక్టోబర్ 1914 తేదీన [[బందరు]] లో జన్మించారు. వీరు 1930లో సారస్వత మండలి మరియు 1936లో పాత్రికేయుల సంఘం ఏర్పాటుచేశారు. ఈయన త్రివేణి పబ్లిషర్స్ ఏర్పాటు చేసి అనేక తెలుగు గ్రంథాలను ప్రచురించాడు. బందరులో త్రివేణి ప్రెస్ స్థాపించాడు.
 
1946 సంవత్సరంలో [[త్రివేణి]] అనే త్రైమాసిక ఆంగ్ల పత్రికను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. [[కోలవెన్ను రామకోటీశ్వరరావు]] స్థాపించిన ఈ పత్రికను ఆయన నలభై సంవత్సరాలు సంపాదకులుగా నిర్వహించి, అవసాన దశలో కంటి చూపు తగ్గి ఆర్ధిక ఇబ్బందులు పెరిగి పత్రిక నడపటం కష్టమైనపుడు పత్రికా నిర్వహణ బాధ్యతలను భావరాజు నరసింహారావుకు అప్పజెప్పాడు. నరసింహారావు ఇరవై ఐదు సంవత్సరాలు సంపాదకులుగా పత్రికను సమర్ధవంతంగా నడిపాడు.<ref>[http://pustakam.net/?p=4697 త్రివేణి వ్యవస్థాపక సంపాదకులు- శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు - సీ.ఎస్.రావు, పుస్తకం.నెట్]</ref>