ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు. ఆంధ్రదేశంలో కృష్ణాతీర వర్తకులు విదేశాలతో విరివిగా వ్యాపారం సాగించారు. తమ సంపదను బౌద్ధధర్మం ఆదరణకు విరివిగా వెచ్చించారు. ఆంధ్ర దేశంలో బౌద్ధాన్ని అధికంగా వర్తకులు మరియు సామాన్య జనం విశేషంగా ఆదరించారు. [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], [[తూర్పు చాళుక్యులు]] వంటి పాలకులు వైదిక మతావలంబులైనా గాని బౌద్ధాన్ని కూడా కొంతవరకు ఆదరించారు. వారి రాణివాస జనం చాలామంది మాత్రం బౌద్ధం పట్ల యెనలేని ప్రేమతో విశేషంగా ఆరామాలకు దానాలు చేశారు. నాగార్జునుని కాలంనుండి మహాయానం విశేషంగా ఆంధ్రదేశంలో వర్ధిల్లింది. వజ్రయానం కూడా కొంతవరకు ఆదరింపబడినప్పటికీ అప్పటికే వైదికమతం పుంజుకోవడంతో బౌద్ధం క్షీణించసాగింది.
[[బొమ్మ:AP Chandavram BudhistChaitya Panel.JPG|right|thumb|200px|చందవరం బౌద్ధచైత్యం శిలాఫలకంమీద ఒక స్థూపం నమూనా]]
 
==స్థూపాలు, చైత్యాలు==
 
[[బొమ్మ:Bhattiprolu 2.jpg|right|thumb|200px|భట్టిప్రోలు స్థూపం శిధిలావశేషాలు]]
బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్థూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్థూపాలలో మూడు రకాలున్నాయి.
 
పంక్తి 32:
 
==కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలు==
[[బొమ్మ:AP Chandavram BudhistChaitya Panel.JPG|right|thumb|200px|చందవరం బౌద్ధచైత్యం శిలాఫలకంమీద ఒక స్థూపం నమూనా]]
[[బొమ్మ:AP Phanigiri BuddhistStupa Panel.JPG|right|thumb|200px|ఫణిగిరి త్రవ్వకాలలో లభించిన శిల్పఫలకం]]
 
[[భట్టిప్రోలు]], [[గుంటుపల్లె|గుంటుపల్లి]], [[జగ్గయ్యపేట]], [[అమరావతి]] ([[ధరణికోట]]), [[నాగార్జునకొండ]], [[వేంగి]] వంటివి ఇటువంటి కొన్ని ముఖ్యక్షేత్రాలలోనివి.
Line 52 ⟶ 50:
 
ఇవే కాకుండా గుమ్మడిదుర్రు, గుడివాడ(కృష్ణా జిల్లా), ఘంటసాల, విద్యాధరపురం, బుద్ధాం, చినగంజాం, ఫణిగిరి, కొండాపూర్, ముంజలూరు, కుమ్మరిలోవ, తగరపువలస(గుడివాడ దిబ్బ)<ref>http://www.thehindu.com/news/states/andhra-pradesh/evidence-of-buddhist-site-found/article3980627.ece</ref>, సరిపల్లి వంటి అనేక క్షేత్రాలు కనుగొనబడ్డాయి. అమరావతితో సహా '''పంచారామాలు''' మొదట బౌద్ధ క్షేత్రాలుగా ఉండేవని ప్రతీతి.
== చిత్రమాలిక ==
 
<gallery>
[[బొమ్మ:AP Phanigiri BuddhistStupa Panel.JPG|right|thumb|200px|ఫణిగిరి త్రవ్వకాలలో లభించిన శిల్పఫలకం]]
[[బొమ్మ:Bhattiprolu 2.jpg|right|thumb|200px|భట్టిప్రోలు స్థూపం శిధిలావశేషాలు]]
</gallery>
==ముఖ్యమైన క్షేత్రాల జాబితా==
క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి క్రీ.శ. 14వ శతాబ్దం వరకు బౌద్ధమతారాధనలో వివిధ దశలను సూచించే 140 కి పైగా బౌద్ధక్షేత్ర స్థలాలను ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. వీటిలో లభించే లిఖిత ఆధారాలు మొత్తం 501 (360 శిలా శాసనాలు, 7 రాగి రేకులు, 134 కుండలు, శంఖాలవంటి వస్తువులపై వ్రాసినవి). ఈ కాలంలో ఆంధ్రదేశంలో జీవనం, కళ, సంస్కృతి బౌద్ధంవల్ల బలంగా ప్రభావితమయ్యాయి. అంతకు ముందు జాతులు, తెగల మధ్యనున్న అగాధాలు పూడుకుపోయి సంస్కృతిలో క్రొత్త బాటలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమరావతి, నాగార్జునకొండ వంటి చోట్ల శిల్పకళ, విద్యాధ్యయనం ప్రభవించాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో 14 ధాతుపేటికలు లభించాయి. ఇవి ఏ ఇతర రాష్ట్రంలో లభించిన వాటికంటే ఎక్కువ. <ref name="Bhikku"/>