వీరుడొక్కడే: కూర్పుల మధ్య తేడాలు

విమర్శకుల స్పందనను జతచేసాను
విమర్శకుల స్పందనను జతచేసాను
పంక్తి 32:
 
== విమర్శకుల స్పందన ==
వీరుడొక్కడే సినిమా విమర్శకుల నుంచి దాదాపు సానుకూల స్పందనను రాబట్టింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "‘వీరుడొక్కడే’ సినిమా చూసినంతసేపు అజిత్ ఒక్కడే వీరుడు అనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా కామెడీ, మాస్ మసాలా ఆశించే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అజిత్ పెర్ఫార్మన్స్, కామెడీ, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్, నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే, పాటలు, కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా వీరుడొక్కడే సినిమాని అజిత్ ఫాన్స్, రెగ్యులర్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారు బాగా ఎంజాయ్ చేస్తారు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/ajith-mass-entertainer-veerudokkade.html|title=సమీక్ష : వీరుడొక్కడే – అజిత్ మాస్ ఎంటర్టైనర్|publisher=123తెలుగు.కామ్|date=March 21, 2014|accessdate=March 22, 2014}}</ref> [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] తమ సమీక్షలో "సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/ajith-kumar-tamannaahs-veerudokkade-movie-review-115135|title=సినిమా రివ్యూ: వీరుడొక్కడే|publisher=[[సాక్షి (దినపత్రిక)|సాక్షి]]|date=March 21, 2014|accessdate=March 22, 2014}}</ref> వెబ్ దునియా తమ సమీక్షలో "పూర్తి మాస్ కథకు కామెడీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్ అన్నింటిని కలిపి ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. గత సినిమాల కంటే అజిత్ మేకప్ లేకుండా పంచెలో అభిమానులను ఆకట్టుకున్నాడు. నటనా పరంగా సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. ఇంకా తమన్నాతో లవ్, సెంటిమెంట్, కామెడీ బాగా పండించాడు. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు అజిత్ సమ్మర్‌లో కొంచెం వినోదాన్ని పంచనున్నాడు" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1403/21/1140321004_1.htm|title=''వీరుడొక్కడే'' మూవీ రివ్యూ రిపోర్ట్!|publisher=వెబ్ దునియా|date=March 21, 2014|accessdate=March 22, 2014}}</ref> తుపాకి.కామ్ తమ సమీక్షలో "తెలుగు సినిమాలాగే ఉండటం 'వీరుడొక్కడే'కు ప్లస్ మాత్రమే కాదు మైనస్ కూడా. తమిళ సినిమా అంటే కాస్త వైవిధ్యంగా ఉంటుందని ఈ సినిమాకెళ్తే నిరాశ తప్పదు. ఇక్కడ కూడా తెలుగు సినిమా చూపించారేంటి అనిపిస్తుంది. ఒక పక్కా మాస్ మసాలా సినిమా చూడాలంటే 'వీరుడొక్కడే'పై ఓ లుక్కెయ్యచ్చు. వైవిధ్యం కోరుకుంటే మాత్రం దూరంగా ఉండటం మేలు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/ajith-mass-entertainer-veerudokkade.html|title=సమీక్ష : వీరుడొక్కడే – అజిత్ మాస్ ఎంటర్టైనర్|publisher=123తెలుగు.కామ్|date=March 21, 2014|accessdate=March 22, 2014}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వీరుడొక్కడే" నుండి వెలికితీశారు