నిడుదవోలు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వెంకటరావుగారి జీవితవిశేషాలు, రచనలపట్టిక చేర్చడమయినది.
పంక్తి 1:
'''నిడుదవోలు వేంకటరావు''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. తండ్రి సుందరంపంతులు. తల్లి జోగమ్మ. జననం జనవరి 3, 1903.
'''నిడుదవోలు వేంకటరావు''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. వీరు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. పట్టభద్రులైనారు. వీరు పిఠాపురం రాజావారి [[శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు]] నిర్మాణంలోను, రాజావారి కళాశాలలో కొంతకాలం పనిచేశారు. అనంతరం మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థలోని ఆంధ్ర శాఖలో చేరి క్రమేపీ ఆ శాఖకు అధ్యక్షులైరి. వీరు [[పరవస్తు చిన్నయసూరి]] జీవితచరిత్ర మరియు [[కొప్పరపు సోదర కవుల చరిత్ర]] లను రచించిరి.
ఆయన హైస్కూలు, ఇంటరు చదువు విశాఖపట్నంలోనూ, బి.ఎ. విజయనగరంలోనూ పూర్తి చేసారు. 1925లో బి.ఎ. పట్టం అందుకుని ఆర్థికపరిస్థితులు కారణంగా పైచదువుకి వెళ్లలేక, ఇంపీరియల్ బాంక్ (ఈనాటి స్టేట్ బాంక్) లో గుమాస్తాగా చేరేరు 1926లో. 1939 వరకూ గుమాస్తాగా పని చేసేరు. ఆ రోజుల్లో పిఠాపురం రాజావారు సూర్యారాయాంధ్ర నిఘంటువులో ఉద్యోగం ఇచ్చేరు. 1944 నుండి 1964వరకూ మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం.
 
==జీవిత విశేషాలు==
ఆయన త్రికరణశుద్ధిగా శైవసిద్ధాంతాన్ని నమ్మడమే కాక, శైవసాహిత్యం ఆనాటి సాంఘికజీవనానికి అద్దం పట్టిందని గ్రహించడం. హైందవసాహిత్యం పండితులకి మాత్రమే పరిమతమయి, కేవలం వారి ఆచార, వ్యవహారాలని మాత్రమే గ్రంథస్థం చేసింది, కానీ బసవపురాణంవంటి శైవమత గ్రంథాలు వైదికధర్మాలని విడిచి ప్రజలజీవనానికి ప్రతీక అయి నిలిచాయి, అవి సరళభాషలో సామాన్యజనానికి వేదాంతరహస్యాలు విడమరిచి చెప్పేయి అంటూ వెంకటరావుగారు దాదాపు ప్రతి పీఠికలోనూ, పరిష్కరణలలోనూ నిరూపించారు. ఆకోణంలోనుండి వెంకటరావు ప్రజలపండితుడుగా గౌరవం పొందేరు. ఏకసంథాగ్రాహి అని ప్రతీతి. వారు చదివిన ప్రతి పుస్తకం తిరిగి అప్పచెప్పగల సమర్థులు.
వెంకటరావుగారు పండితారాధ్యచరిత్రకి విస్తృతమయిన పీఠికతోపాటు పరిష్కరించడంలో అసమానమయిన పాండిత్యాన్ని ప్రదర్శించేరని పండితులు శ్లాఘించేరు. నిజానికి ఆయన ఏ పుస్తకానికి పీఠిక రాసినా, కేవలం పుస్తకంలో వస్తువుకే పరిమితం చేయక, దానికి సంబంధించిన అనేక విషయాలు చర్చిస్తారు. వారిపీఠికలద్వరా పుస్తకం ప్రాచుర్యంలోనికి వచ్చినసందర్భాలు కూడా వున్నాయి. 1944లో త్రిపురాంతకోదహరణము కి విపుల పీఠిక రాసి ప్రచురించేరు. తొలిసారిగా ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చింది నిడుదవోలు వెంకటరావుగారు. ఆయన ఉదాహరణ వాఙ్మయము అన్న గ్రంథం రాసి పండితులమన్నన అందుకున్నారు. శైవ సాహత్యంమీద విశేషంగా కృషి చేసేరు. పండితారాధ్యచరిత్రకి విస్తృతమైన పీఠిక వెంకటరావుగారికి ప్రతిష్ఠ తెచ్చింది.
'''నిడుదవోలు వేంకటరావు''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. వీరు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. పట్టభద్రులైనారు. వీరు పిఠాపురం రాజావారి [[శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు]] నిర్మాణంలోను, రాజావారి కళాశాలలో కొంతకాలం పనిచేశారు. అనంతరం మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థలోని ఆంధ్ర శాఖలో చేరి క్రమేపీ ఆ శాఖకు అధ్యక్షులైరి. వీరు [[పరవస్తు చిన్నయసూరి]] జీవితచరిత్ర మరియు [[కొప్పరపు సోదర కవుల చరిత్ర]] లను రచించిరి.
15 అక్టోబరు 1982 తేదీన దివంగతులయారు.
 
==బిరుదులు==
* విద్యారత్న
* కళాప్రపూర్ణ
==సాహిత్యం==
* త్రిపురాంతకోదాహరణము. విపుల పీఠికతో. 1944.
* తెలుగు కవులచరిత్ర
* చిన్నయసూరి జీవితము: [[పరవస్తు చిన్నయసూరి]]కృత హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము సహితముగా. 1962.
* [[దక్షిణదేశీయాంధ్ర వాఙ్మయము]]. The Southern School of Telugu Literature (with preface in English). 1954.
* [[కొప్పరపు సోదరకవుల చరిత్ర]]. 1973.
* నన్నెచోడుని కవితావైభవము: నన్నెచోడుని పద్యాలకు రుచిర వ్యాఖ్యానము. 1976.
* పోతన. 1962.
* తెలుగు కవుల చరిత్ర. 1956.
* ఉదాహరణ వాఙ్మయ చరిత్ర. 1968.
* విజయనగర సంస్తానము: ఆంద్రవాఙ్మయ పోషణ. 1965.
* ఆంధ్ర వచనవాఙ్మయము. 1977.
* ఆంధ్ర వచనవాఙ్మయము: ప్రాచీనకాలమునుండి 1900 ఎ.డి. వరకు. 1954.
==పీఠికలు, వ్యాఖ్యానములు==
*శ్రీ నాచన సోమును హంసాదిపకోపాఖ్యానము (ఉత్తర హరివంశము, చతుర్థ ఆశ్వాసము. 1972.
==పరిష్కరించినవి==
* మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము. నిడుదవోలు వెంకటరావు విపుల టీకతాత్పర్యములతో. 1968
* నంది మల్లయ ప్రబోధ చంద్రోదయము. సం. నిడుదవోలు వెంకటరావు. 1976.
* బహుజనపల్లి సీతారామాచార్యులు. శబ్దరత్నాకరము. నిడుదవోలు వెంకటరావుచే సరిదిద్దబడినది. 1969.
==ఇతర రచయితలతో సహకరించి కూర్చిన గ్రంథములు==
* మడికి సింగన. సకల నీతిసారము. సం. నిడుదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు. 1970.
* మానవల్లి రచనలు. సం. నిడుదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు. 1972.
* తెలుగు కన్నడముల సాంస్కృతిక సంబంధములు. సం. నిడుదవోలు వెంకటరావు, et. Al. 1974.
* తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ బాషలలో సాటి సామెతలు. కూర్పు. నిడుదవోలు వెంకటరావు, et. al., 1961.
==నిడుదవోలు వెంకటరావుకృషి గురించి ఇతరుల రచనలు==
* నిష్టల వెంకటరావు. నిడుదవోలు వెంకటరావు – ఒక పరిశీలన. 1984. (వెంకటరావు సంపూర్ణ రచనలపట్టిక, అంశములవారీగా విభజింపడిన 35 పుటల అనుబంధముతో).
==బయటి లింకులు==
http://thulika.net/?p=234
http://tethulika.wordpress.com/2009/10/28/నిడుదవోలు-వెంకటరావుగారు/
==References==
{{reflist}}
 
==మూలాలు==
Line 8 ⟶ 50:
[[వర్గం:తెలుగు పరిశోధకులు]]
[[వర్గం:మొలక]]
[[వర్గం:1903 జననాలు]]
[[వర్గం:1982 మరణాలు]]