నిడుదవోలు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

వెంకటరావుగారి జీవితవిశేషాలు, రచనలపట్టిక చేర్చడమయినది.
పంక్తి 5:
ఆయన త్రికరణశుద్ధిగా శైవసిద్ధాంతాన్ని నమ్మడమే కాక, శైవసాహిత్యం ఆనాటి సాంఘికజీవనానికి అద్దం పట్టిందని గ్రహించడం. హైందవసాహిత్యం పండితులకి మాత్రమే పరిమతమయి, కేవలం వారి ఆచార, వ్యవహారాలని మాత్రమే గ్రంథస్థం చేసింది, కానీ బసవపురాణంవంటి శైవమత గ్రంథాలు వైదికధర్మాలని విడిచి ప్రజలజీవనానికి ప్రతీక అయి నిలిచాయి, అవి సరళభాషలో సామాన్యజనానికి వేదాంతరహస్యాలు విడమరిచి చెప్పేయి అంటూ వెంకటరావుగారు దాదాపు ప్రతి పీఠికలోనూ, పరిష్కరణలలోనూ నిరూపించారు. ఆకోణంలోనుండి వెంకటరావు ప్రజలపండితుడుగా గౌరవం పొందేరు. ఏకసంథాగ్రాహి అని ప్రతీతి. వారు చదివిన ప్రతి పుస్తకం తిరిగి అప్పచెప్పగల సమర్థులు.
వెంకటరావుగారు పండితారాధ్యచరిత్రకి విస్తృతమయిన పీఠికతోపాటు పరిష్కరించడంలో అసమానమయిన పాండిత్యాన్ని ప్రదర్శించేరని పండితులు శ్లాఘించేరు. నిజానికి ఆయన ఏ పుస్తకానికి పీఠిక రాసినా, కేవలం పుస్తకంలో వస్తువుకే పరిమితం చేయక, దానికి సంబంధించిన అనేక విషయాలు చర్చిస్తారు. వారిపీఠికలద్వరా పుస్తకం ప్రాచుర్యంలోనికి వచ్చినసందర్భాలు కూడా వున్నాయి. 1944లో త్రిపురాంతకోదహరణము కి విపుల పీఠిక రాసి ప్రచురించేరు. తొలిసారిగా ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చింది నిడుదవోలు వెంకటరావుగారు. ఆయన ఉదాహరణ వాఙ్మయము అన్న గ్రంథం రాసి పండితులమన్నన అందుకున్నారు. శైవ సాహత్యంమీద విశేషంగా కృషి చేసేరు. పండితారాధ్యచరిత్రకి విస్తృతమైన పీఠిక వెంకటరావుగారికి ప్రతిష్ఠ తెచ్చింది.
వీరు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. పట్టభద్రులైనారు. వీరు పిఠాపురం రాజావారి [[శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు]] నిర్మాణంలోను, రాజావారి కళాశాలలో కొంతకాలం పనిచేశారు. అనంతరం మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థలోని ఆంధ్ర శాఖలో చేరి క్రమేపీ ఆ శాఖకు అధ్యక్షులైరి. వీరు [[పరవస్తు చిన్నయసూరి]] జీవితచరిత్ర మరియు [[కొప్పరపు సోదర కవుల చరిత్ర]] లను రచించిరి.
15 అక్టోబరు 1982 తేదీన దివంగతులయారు.
 
==బిరుదులు==