ఆదర్శ వనితలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[మైత్రేయి]]
* [[ఘోష]]
వేదకాలం లో ఋషులు మాత్రమే మంత్రాలు చెప్పలేదు. కొందరు మహిళలు కూడా మంత్రాలు చెప్పారు. అటువంటివారిని ద్రష్టలు అంటారు. వేదద్రష్టలు మంత్ర దర్శినులు అయిన మహిళలు ఇరవై నాలుగు మందికి పైగా ఉన్నారు. గోధ ఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, శశ్వతి, [[లోపాముద్ర]], వాక్, శ్రద్ధ, మేధ, సూర్య, మాంధాత్రి, సావిత్రి మొదలయినవి వారి పేర్లు.
 
[[గార్గి]] పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది. పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఆదర్శ_వనితలు" నుండి వెలికితీశారు