చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
==రచయిత గురించి==
{{main|బుచ్చిబాబు}}
[[బుచ్చిబాబు]] గురించి [[మధురాంతకం రాజారాం]] ఓ చోట ఇలా అంటారు- "బుచ్చిబాబు"గా ప్రసిద్ధి చెందిన [[శివరాజు వేంకట సుబ్బారావుగారుసుబ్బారావు]]గారు పశ్చిమగోదావరి జిల్లాలో 1916లో జన్మించారు. ఎం.ఎ. (ఇంగ్లీషు) పట్టభద్రులు. షేక్స్‌పియర్‌, బెట్రెండ్‌ రస్సెల్‌, సోమర్సెట్‌మామ్‌, టి.ఎస్‌.ఇలియట్‌, ఆల్దస్‌ హాక్స్‌లీ వంటి మహామహుల సాహిత్యాన్ని ఔపోశన పట్టారు. తెలుగులో కథాశిల్పానికి వన్నెలు బెట్టిన మహారచయితల్లో ఒకరు. నిరంతర త్రయం, ఎల్లోరాలో ఏకాంతసేవ, కాలచక్రం నిలిచింది, మరమేకులు-చీరమడతలు, తడిమంటకు పొడినీళ్లు, అడవిగాచిన వెన్నెల, మేడమెట్లు- ఇలా ఖండ కావ్యాల్లాంటి కథలెన్నో రాశారు. తెలుగు నవలల్లో ఆయన రచన 'చివరికి మిగిలేది' ప్రముఖమైనది. <ref name="chikolu">[http://www.eenadu.net/archives/archive-18-9-2008/sahithyam/display.asp?url=chaduvu3.htm [[ఈనాడు]] లో చీకోలు సుందరయ్య వ్యాసం] </ref>
 
==అభిప్రాయాలు==